తెలంగాణ దేశానికి అన్నపూర్ణ

తెలంగాణ దేశానికి అన్నపూర్ణ

తిప్పర్తి రైతు వేదికలో రైతు దినోత్సవంలో నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి

తిప్పర్తి /నల్గొండ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం వ్యవసాయ రంగంలో రాష్ట్రం,జిల్లా గణనీయమైన పురోభివృద్ధి సాధించినట్లు నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ దశాబ్ది ఉత్స‌వాల నేప‌థ్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో రైతు దినోత్స‌వం ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో చేసిన అభివృద్ధిని, సాధించిన ప్రగతిని ఆయా గ్రామాల్లోని రైతులకు వివరించారు. వ్యవసాయ శాఖ ముద్రించిన మన “తెలంగాణ దేశానికి అన్నపూర్ణ”, ” పంటలను నెల ముందస్తుగా సాగు చేద్దాం” అనే ప్రచార కరపత్రాలను రైతులకు పంపిణీ చేశారు.ఉత్తమ రైతులకు అవార్డు లు,మరణించిన రైతు కుటుంబాలకు రైతు భీమా చెక్కులు అంద చేశారు. తిప్పర్తి మండలం తిప్పర్తి క్లస్టర్ రైతు వేదికలో నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డిలు పాల్గొని జిల్లా రైతులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

ముందుగా గ్రామ సెంటర్ నుండి రైతు వేదిక వద్దకు ట్రాక్టర్ లతో రైతులు శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డిలు ర్యాలీ గా చేరుకున్నారు.
రైతు వేదిక లో నిర్వహించిన సమావేశంలో
నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కు ముందు తర్వాత పరిస్థితులు గమనిస్తే అభివృద్ధి అర్థం అవుతుందని అన్నారు.సమైక్య రాష్ట్రంలో సాగు నీరు లేదు విద్యుచ్చక్తి లేదు. ఎండిన బోర్లు,బీటలు వారిన పంట పొలాలు కనిపించేవి,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 9 సం.లలో సాగు నీరుతో పచ్చని పొలాలు పంటల ఉత్పత్తితో రికార్డు సృష్టిస్తున్నట్లు తెలిపారు.ముషం.పల్లి లో నాడు రైతు పొలం లో 70 బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు .ఇప్పుడు చెరువు లో పుష్కలం గా నీటి తో అలుగు పొస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి తీసుకున్న కార్యక్రమాలు కారణమని అన్నారు.రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగు నీటి తోపాటు మొదటి సం.9 గంటలు,రెండవ సం.నుండి 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం రైతు కు ఉచిత కరెంట్ కు ప్రతి సం.10 వేల కోట్ల రూ.లు ఖర్చు చేస్తోందని అన్నారు.సం.కు 10 వేల రూ.లు పెట్టుబడి సాయం అందిస్తుందని అన్నారు. రైతులు అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు.జిల్లాలో యాసంగిలో రైతులకు ఇబ్బంది లేకుండా 40,45 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి కావచ్చినట్లు తెలిపారు.జిల్లాలో సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ కు దగ్గరగా వుందని,నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజక వర్గం,నియోజక వర్గంలో తిప్పర్తి అత్యధిక ధాన్యం సేకరణ ముందు వుందని అన్నారు.
రైతులు పంటల సాగుతో పాటు పాడిపై, ప్రత్యామ్నయ పంటల సాగు ఆయిల్ ఫాం ,కూరగాయల సాగు పై దృష్టి సారించింది ఆదాయం పొందాలని అన్నారు
జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సం.లు పూర్తి చేసుకుని 10 సం.లోకి అడుగిడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు 21 రోజుల పాటు ఘనంగా పండుగలా నిర్వహించు కుంటున్నట్లు తెలిపారు.21 రోజుల పాటు ప్రతి రోజూ ఒక్కొక్క రంగం లో సాధించిన అభివృద్ధి ని, ప్రతి పౌరునికి తెలుపాలని అన్నారు.9 సం.లలో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఏం చేసింది రైతులకు ఎం మేలు జరిగింది గ్రామం లో చర్చించు కోవాలని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, సాగుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ తో పాటు రైతుల సంక్షేమ, అభివృద్ధిని కాంక్షించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో యాసంగిలో నల్గొండ జిల్లా అత్యధికంగా 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసినట్లు తెలిపారు.
*ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల భూ క్రయ,విక్రయాలు రిజిస్ట్రేషన్ సులువు*
వ్యవసాయ భూముల క్రయ,విక్రయాలు రిజిస్ట్రేషన్ సులువుగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ రూపొందించిందని అన్నారు. తిప్పర్తి మండల పరిధిలో 13 రెవెన్యూ గ్రామాల్లో రైతులకు వ్యయ ప్రయాసలు లేకుండా ధరణి పోర్టల్ ద్వారా భూ క్రయ విక్రయాలు 4049 జరుగగా నిర్వహించినట్లు ఇందులో 3545 కొనుగోలు, బహుమానం 74 నాలా, 423 పౌతి,7 భాగ పంపిణీ ఉన్నట్లు వివ రాలు వెల్లడించారు.
సాంకేతిక పరిజ్ఞానం ను ఉపయోగించి ఫోన్ ద్వారా రాత్రి 12 గంటల లోపు ధరణి పోర్టల్ లో స్లాట్ బుక్ చేసుకుంటే మరుసటి రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు.మీ సేవా ద్వారా కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చని అన్నారు.గతం లో లాగా కార్యాలయం ల చుట్టూ తిరగ వలిసిన అవసరం లేదని అన్నారు.గతం లో రిజిస్ట్రేషన్ అయినా పాస్ బుక్ రావటానికి రోజులు, నెలలు తరబడి సమయం తీసుకుంది. అన్నారు.రిజిస్ట్రేషన్ అయిన పాస్ బుక్ రాని వారు లోపాలు వుంటే ధరణి ద్వారా సరి చేసుకోవచ్చని అన్నారు.ఇంతకు ముందు లోపాలకు ధరణి పరిష్కారం చూపుతుందని అన్నారు.తప్పులు సరి దిద్దుకునే అవకాశం, రిజిస్ట్రేషన్ కాకుంటే రిజిస్ట్రేషన్ ధరణి పోర్టల్ ద్వారా అవకాశం కల్పిస్తుందని అన్నారు. రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్న రోజు పూర్తి అవుతుందని,చెప్పిన అడ్రస్ కు పాస్ పుస్తకం వస్తుందని అన్నారు. ప్రతి రోజూ ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ లు కలెక్టర్,అదనపు కలెక్టర్,రాష్ట్ర స్థాయి లో భూ పరిపాలన కమిషనర్ మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు.గతం లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లలో జరిగిన రిజిస్ట్రేషన్ లు ప్రజలకు చేరువగా తహశీల్దార్ కార్యాలయం లో జరుగుచున్నట్లు తెలిపారు.
రైతులు వరి సాగుతో పాటు ఆదాయం చేకూర్చే ఆయిల్ ఫాం సాగు పై దృష్టి సారించాలని అన్నారు.ఆయిల్ ఫాం కు ప్రభుత్వం సబ్సిడీ,డ్రిప్ సౌకర్యం తో పాటు, అంతర పంటల సాగుకు 4 సం.లు సహాయం అందిస్తుందని అన్నారు.పంట ను ప్రభుత్వం పతంజలి వారి ద్వారా కొనేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.జిల్లాలో 14500 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు చేయాలని లక్ష్యం నిర్ణయించి నట్లు తెలిపారు.మంచి మొక్కలు కేతేపల్లి నర్సరీ లో సిద్దంగా వున్నట్లు తెలిపారు.
*ముందస్తు సాగు చేద్దాం*
గత 2-3 సం.ల నుండి యాసంగి కాలంలో వేసిన వారి ఇతర ఆరుతడి పంటలు అకాల వర్షాలు పడగండ్ల వానలు ఈదురుగాల్ల వల్ల వివిధ పంటలు కష్టాలు జరుగుతున్నాయని అన్నారు వానాకాలం వరి పంటను ముందస్తుగా సాగుచేసి పంట కోతలను అక్టోబర్ మూడో వారం నుండి నవంబర్ మొదటి వారంలోపు పూర్తి చేసుకోగలిగితే రెండో పంట నేల తయారీకి అనుకూలమైన సమయం ఉంటుందన్నారు మొదలను నవంబర్ 15_ 20 మధ్యలో చేపట్టినట్లయితే మార్చి చివరి వరకు లేదా ఏప్రిల్ మొదటి వారంలో వరి పంటకు పోతాను పూర్తి చేసుకోవచ్చు తద్వారా అకాల వర్షాలు వడగండ్ల వాన నుండి పంటలను రక్షించుకోవడం వీలవుతుందన్నారు
ఈ సందర్భంగా నూతన పద్దతులు అవలంబించిన ఆదర్శ రైతులు 5 గురు వల్లపు రెడ్డి దశ రథ రెడ్డి(తిప్పర్తి), వల్లపు రెడ్డి మధుకర్ రెడ్డి(తిప్పర్తి),మే రెడ్డి యాదగిరి రెడ్డి(గడ్డి కొండారం), మారుపాక కొండయ్య (మర్రి గూడ), జంకటి సామెల్ ( తిప్పర్తి) లను సన్మానం చేశారు.రైతు భీమా,రైతు బంధు లబ్ది దారులు మాట్లాడారు.
జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రామ్ రెడ్డి, తిప్పర్తి గ్రామ సర్పంచ్ రొట్టెల రమేష్,వ్యవసాయ శాఖ ఏ.డి.లు హుస్సేన్ బాబు, శ్రావణ్,వ్యవసాయ అధికారి సన్నీ రాజ్,పి.అర్. డిఈ నాగయ్య, మండల పార్టీ అధ్యక్షుడు పాల్ రెడ్డి రవీందర్ రెడ్డి రైతుబంధు సమితి జిల్లా సభ్యురాలు వనపర్తి జ్యోతి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందుల రేణుక, సర్పంచులు ఎర్ర మాద కవిత , భాస్కర్ రెడ్డి, పోకల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
*జిల్లాలో రైతు దినోత్సవం విజయ వంతం*
తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ దశాబ్ది ఉత్స‌వాల నేప‌థ్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్స‌వం నల్గొండ జిల్లాలో విజయవంతం గా నిర్వహించారు జిల్లా పరిధిలోని మొత్తం 140 క్లస్టర్ల పరిధిలోని రైతు వేదికలలో ఈ వేడుకకు వేదికయ్యాయి.
శుక్రవారం నుంచే అన్ని రైతువేదికలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మామిడి తోరణాలు, అరటి ఆకులు, బంతిపూలతో రైతు వేదికలు సరికొత్త పండుగ శోభను సంతరించుకొని రైతులకు ఆత్మీయ ఆహ్వానం పలికాయి. ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.
రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, క్లస్టర్ పరిధిలో సాధించిన విజయాలను తెలుపుతూ వ్యవసాయ అధికారులు ప్రదర్శించిన ఫ్లెక్సీలు రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కరపత్రాలు రైతులను ఆలోచింపజేశాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను ఓపిగ్గా విన్నారు. వేడుకల్లో క్లస్టర్ పరిధిలోని రైతు క్లస్టర్ పరిధి రైతు వేదిక లోని ఆదర్శ రైతులను ఆయిల్ ఫామ్ సాగు చేసే చేస్తున్న పలు రైతులను ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమం చివరలో ప్రతి క్లస్టర్ పరిధిలో ప్రజాప్రతినిధులు ,అధికారులు, రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking