పండుగలా రైతు సందడి
నల్లమోతు భాస్కరరావు
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వేములపల్లి మండల కేంద్రంతోపాటు శెట్టిపాలెం రావులపెంట క్లస్టర్ రైతు వేదికలలో శనివారం రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతులు ట్రాక్టర్లకు తోరణాలు, పూలతోఅందంగా అలంకరించి భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈసందర్భంగామండలకేంద్రంలోనిర్వహించినరైతుర్యాలీలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు పాల్గొన్నారు. అనంతరం రైతువేడుకలలో జరిగిన రైతు సభలలో పలువురు మాట్లాడుతూ తెలంగాణరాష్ట్ర ఏర్పాటు అనంతరం సాగునీటి వసతి, ఉచిత కరెంటు పంటల పెట్టుబడి సాయం రైతుబంధు పథకం అమలు తో మండలంలో పంటలు సాగు గణనీయంగా పెరిగిందన్నారు. వరి పంటలు రికార్డు స్థాయిలో సాగు చేయడమే కాక దిగు దిగుబడులు కూడా అదే స్థాయిలో నమోదు కావడం జరిగినది.మండలంలో80 శాతం మంది వ్యవసాయ మీద ఆధారపడే వారు కావడంతో పంటలు సాగువలన రైతులకు ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. కొత్త ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్, సాగర్ ప్రాజెక్టు ద్వారా రెండు కార్లకు నీరుసమృద్ధిగా అందించడం 24 గంటల ఉచిత కరెంటు సరఫరాతో వేలాదిఎకరాలఅదనపు విస్తీర్ణంసాగులోకి వచ్చిందన్నారు. అధిక విస్తీర్ణంలో పంటలు సాగవ్వడం వలన రైతులకు ఆర్థికఅభివృద్ధికితోడ్పడిందన్నారు.రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలి ఖర్చులకు ప్రభుత్వం పెట్టుబడి రూపేణ ప్రతి వ్యవసాయ సీజనులో రైతుబంధుపథకంకింద ఎకరానికి రూ.5వేలు ఏడాదికి వానకాలం, యాసంగి రెండు సీజన్లకు కలిపి రూ.10వేలు నేరుగా రైతు ఖాతాలో సీజన్ కు ముందు జమచేస్తుందన్నారు. తద్వారా రైతు పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు చేసి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చేయడం ఈ పథకం రైతులకు ఉపయోగపడిందన్నారు. రైతు బీమా పథకంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఐదు లక్షల రూపాయల బీమా చేయబడుతుందని ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ఎల్ఐసి సంస్థ రైతు నమోదు చేసుకున్న నామినికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తుందన్నారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు 60శాతంసబ్సిడీ మీద పచ్చిరొట్టె, విత్తనాలు, జీలుగు, జినుము, పంట విత్తనాలు ఎరువులు తక్కువ ధరలకు రైతులకు అందించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ఇరుగు మంగమ్మవెంకటయ్య, వైస్ ఎంపిపి పాదూరి గోవర్దని శశిధర్ రెడ్డి, తహశీల్దార్ వెంకటేశం, ఎంపీడీఓ అజ్మీరాదేవిక, ఎస్ సిఎల్ ఏడి శాంత నిర్మల, ఎడిఎ పోరెడ్డినాగమణి రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మాలి శంకర్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ జెర్రిపోతుల రాములుగౌడ్, స్థానిక సర్పంచులు చిర్రమల్లయ్య యాదవ్ మజ్జిగపు పద్మసుధాకర్ రెడ్డి, దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి ఏవో మేకల ఋషీంద్రమనితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు బిఆర్ఎస్ నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్, పేరాల కృపాకర్ రావు ఉగ్గే మునీశ్వర్ రావు, నాగవెల్లి శంకర్, అమిరెడ్డి శేఖర్ రెడ్డి, గుండెబోయిన లక్ష్మయ్య, పుట్టల పౌలు, నకరికంటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.