పోలీసు డౌన్.. డౌన్ నుంచి పోలీస్ సలాం
ఫ్రెండ్లి పోలీస్ విధానంతో ఇది సాధ్యం
షి టీమ్స్ తో మహిళలకు రక్షణ
ఫ్రాక్షన్ విలేజిలలోను ఫరిడవిల్లుతున్న ప్రశాంతత
ఆధునిక పరిజ్ఞానంతో శాంతి భద్రతల రక్షణ
కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో జంటనగరాలు
శాంతిభద్రతలు కట్టడిలో ఉన్నందునే 50 వేల పరిశ్రమల స్థాపన
కేసీఆర్ ఆలోచనను అమలులో పెడుతున్న పోలీస్
తెలంగాణ రాష్ట్రసాధనతోనే ఇవ్వన్నీ సాధ్యo
మంత్రి జగదీష్ రెడ్డి*
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
పోలీసు డౌన్.. డౌన్ అనే రోజులు పోయి పోలీసు సలాం అనే రోజులు తెలంగాణ లో వచ్చాయని,తెలంగాణా ప్రభుత్వం తెచ్చిన ఫ్రెండ్లి పోలీస్ విధానం తో ఇది సాధ్యం అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ భారతదేశంలో ఫ్రెండ్లి పోలీస్ ఉన్నది ఒక్క తెలంగాణా లోనేనని అన్నారు ..షి టీమ్స్ తో మహిళలకు సంపూర్ణ రక్షణ కలిపిస్తున్న రాష్ట్రంగా తెలంగాణా ఘనతి కెక్కిందని ఆయన చెప్పారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్దిఉత్సవాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా లో ఘనంగా కొన సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్వహించిన సురక్ష దినోత్సవానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగాపెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కక్షలు కార్పణ్యాలతో తల్లడిల్లిన పల్లెల్లో శాంతి కపోతాలు ఎగురు తున్నాయి అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత అని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను తూ. చ తప్పకుండా పోలీస్ శాఖా అమలు పరుస్తున్నందునే తొమ్మిదేళ్లలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగ లేదన్నారు.ఫ్రాక్షన్ విలేజీల్లోనూ ప్రశాంతత ఫరీడవిల్లుతున్నది అంటే ప్రజా క్షేమం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న చొరవ మాత్రమే నన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో శాంతి బద్రతలను పరిరక్షించేందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అని అది ఇప్పుడు దేశానికే దిక్సూచి గా మారిందన్నారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా కట్టడిలో ఉన్నందునే పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి 50 వేల పరిశ్రమలు నెలకొల్పారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను పోలీస్ శాఖా అమలు పరుస్తునందునే తెలంగాణా పోలీస్ అద్భుత విజయాలు నమోదు చేసుకుందన్నారు. పోలీసు విచారణ లో అనేక నూతన పద్దతులను తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు.. ఇటీవల వచ్చిన నూతన టెక్నాలజీ విధానంతో సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న వందమందికి ఫోన్ లను రికవరీ చేసిన తీరు నల్లగొండ జిల్లా పోలీసుల పని తీరుకు నిదర్శనం అన్నారు. అనంతరం పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి మంత్రి మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు.పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, నలమోతు బాస్కర్ రావు, రవీంద్ర నాయక్, భూపాల్ రెడ్డి, ఎం.ఎల్.సి కోటిరెడ్డి, జడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, యస్ పి అపూర్వ రావ్ తదితరులు పాల్గొన్నారు.