పరిపాలన సంస్కరణలు
చక్కటి ఫలితాలు
దశాబ్ది సుపరిపాలన ప్రగతి
మండలి చైర్మన్ గుత్తా, నలమోతు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధ ఉత్సవాల్లో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు, ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు, ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు జిల్లాలో చక్కని పలితాలు ఇస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అంటే దూర భారంతో ప్రజలు ఇబ్బందులు పడే వారు, పరిపాలన వికేంద్రికరణలో భాగంగా కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతిలను, ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనితో ప్రజలకు ఉత్తమ సేవలు అందుతున్నాయని తెలిపారు. శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో నూతనంగా 53 గ్రామ పంచాయతీలు, మరియు 2 కొత్త మండలాలను ఏర్పాటు చేసుకున్నామని 53 గ్రామ పంచాయతీలల్లో నూతనంగా 38 తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాం.

మా తండాలో మాదే రాజ్యం నినాదం అనుగుణంగా తండాలను నూతన పంచాయతీలుగా తీర్చి దిద్దుకున్నం అని బి.ఆర్.ఎస్ పార్టీ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారు. గత ప్రభుత్వాలు గిరిజన తండాలను గాలికి వదిలేసారు రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దుకున్నాం, అంతే కాకుండా ప్రతి తండాలో నూతనంగా సిసి రోడ్ల నిర్మాణం, అంతర్గత డ్రైనేజీ నిర్మాణాలు జరుపుకుంటున్నామని అదే విధంగా 9యేండ్లలో అడవిదేవులపల్లి మండలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో యంపిపి ధనవత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ కుర్రా సేవ్యానాయక్, మాజీ ఎంపిపి కురాకుల మంగమ్మ, ఎంపిడిఓ మసూద్ షరీఫ్, మండల పార్టీ అద్యక్షులు కురాకుల చినరామయ్య, సర్పంచ్ ఫోరం అద్యక్షులు కొత్త మర్రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు బాబ్జని, బిఆర్ఎస్ నాయకులు గురువయ్య, ముత్యాలు, సూర్యనాయక్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీను, పిఎసిఎస్ చైర్మన్ లు, డైరెక్టర్ లు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటీసిలు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, ఆయా గ్రామాల బిఆర్ఎస్ అధ్యక్షులు ఇతర విభాగాల కమిటి వారు, అన్నీ గ్రామాల కో-ఆర్డినేటర్లు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, బి ఆర్ఎస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజారయ్యారు.