ఘనంగా టిఆర్ఎస్ నేత చంద్ర మోహన్ సాగర్ జన్మదిన వేడుకలు..
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వార్డు మెంబర్ సగర సంఘం జగద్గిరిగుట్ట యువజన సంఘం ప్రధాన కార్యదర్శి సూరి చంద్రమోహన్ సాగర్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గాంధీతో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, వివేకానంద నగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు జి. సంజీవరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కరరావు, నాయినేనీ అభిలాష్ రావు, జగదిరిగుట్ట సగర సంఘం అధ్యక్షులు దయాసాగర్ తదితరులు చంద్రమోహన్ సాగర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.