ఇంటింటికి బిజేపి భరోసా యాత్ర

వడ్డేపల్లి ఆధ్వర్యంలో 12’వ రోజు ఇంటి ఇంటికి బిజెపి భరోసా యాత్ర…వాట్ ఇస్ దిస్ ఎమ్మెల్యే అని ప్రశ్నిస్తున్న బోయిన్ పల్లి జనం

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :

కూకట్ పల్లి కి చెందిన బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో 12’వ రోజు ఆదివారం ఇంటి ఇంటికి బిజెపి భరోసా యాత్రలో స్థానిక ప్రజలు వాట్ ఇస్ దిస్ ఎమ్మెల్యే అంటు బోయిన్ పల్లి జనం అభిమానంతో ముంచెత్తారు. బోయిన్ పల్లి డివిజన్ లో ఉన్న ఎచ్.ఏ.ఎల్ పార్క్ అభివృద్ధిని సంబంధిత అధికారులు మరియు స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవడంలేదని అని హెచ్.ఏ.ఎల్ పార్క్ వర్కర్స్ ఇంటింటికి బిజెపి భరోసా యాత్రను నిర్వహిస్తున్న బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుకి కాలనీ ప్రజలు కలిసి వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వివరించి పరిష్కార మార్గం చూపించాలని కోరారు.

పార్కులో నిత్యం రోజుకు రెండు వందల మంది వరకు ప్రజలు రోజు వస్తూపోతు ఉంటారనీ పార్క్ లో ఏలాంటి సదుపాయలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1975లో ఈ పార్కును ప్రారంభించారనీ ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఎవరు లేక పార్క్ లో రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించు కుంటున్నారనీ, వాటి వల్ల మాకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పార్క్ పక్క నుంచి వెళ్లాలంటే భయమవుతుందని, అలాగే వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ ఉన్నాయి వాటి వల్ల పార్కులోకి పిల్లల్ని పంపించాలంటే భయమేస్తుందన్నారు, ఇక్కడ కనీసం కూర్చోవడానికి కూడా కుర్చీలు లేవు, సిసి కెమెరాలు లేవు , పార్క్ లోని వాచ్మెన్ రూమ్ ను ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కేటాయించి వాచ్మెన్ ఉండటానికి సదుపాయం లేకుండా చేశారని దానివల్ల ఇక్కడ భద్రత కరువైందని, పార్క్ లో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలుగా చేసి వదిలేస్తున్నారని, మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి సరైన వాకింగ్ ట్రాక్ లేదని, ఆరోగ్యం కోసం పార్కు వస్తాం అనుకుంటే అనారోగ్య పాలవుతున్నామని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వాట్ ఇస్ దిస్ ఎమ్మెల్యే అని ఎమ్మెల్యేని ప్రశ్నించి వడ్డేపల్లి రాజేశ్వరరావుకి వారి సమస్యలను తెలియజేశారు. వారి సమస్యలను తెలుసుకున్న బిజెపి నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి ఈ సమస్యను ఎప్పటిలోగ తీరుస్తారని అధికారులతో మాట్లాడారు. లేదంటే నేను మా కార్యకర్తలతో వచ్చి ఈ పార్కును శుభ్రం చేసి పార్క్ లో అభివృద్ధి పనులు చేస్తానని అక్కడున్నటువంటి ప్రజలకు భరోసా ఇచ్చారు.12’వ రోజు ఇంటి ఇంటికి బిజెపి భరోసా యాత్రను సమతా నగర్ బస్ స్టాప్ నుంచి మొదలు చేసుకొని గడపగడపకు వెళ్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి వడ్డేపల్లి రాజేశ్వరరావు ముందుకు కొనసాగుతున్నారు.
ఈ రోజు భరోసా యాత్రలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్శనపల్లి సూర్యారావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ , జిల్లా కార్యదర్శి వెంకట్ కాంత్ (పప్పు పటేల్), జిల్లా కిసన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి యాదవ్, బోయిన్ పల్లి డివిజన్ అధ్యక్షులు సంతోష్ గౌడ్ రాజముత్తుల, జిల్లా నాయకులు సత్యమూర్తి, బిజెపి నాయకులు ధర్మ చౌదరి,శరణ్ కుమార్ చౌదరి, రవి కుమార్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, బోయిన్ పల్లి డివిజన్ నాయకులు అమర్ గౌడ్, రఘు, లక్ష్మి, వెంకటేష్, సాయి, లోకేష్, వాణి, తులసి, బిజెవైయం శేఖర్, కార్తీక్, భగత్, అనిల్, సాయి చరన్, చైతన్య, నికిల్, అభిషేక్, కశ్యప్ మరియు రాష్ట్ర మరియు జిల్లా పార్టీ సీనియార్ నాయకులు, వివిధ డివిజన్ ల అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking