ఇంటింటికి తాగు పొలాల్లోకి సాగు నీరు

ఇంటింటికి తాగు
పొలాల్లోకి సాగు నీరు

రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

*మంత్రి సహకారంతో మిర్యాలగూడ అభివృద్ధి

*ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిర్యాలగూడ ఎఆర్సి గార్డెన్స్ లో జరిగిన పట్టణ ప్రగతి కార్యకమనికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ శాఖకు చెందిన ఉత్తమ ఉద్యోగులను, శానిటేషన్ వర్కర్లను సన్మానించి, ప్రసంశ పత్రాలను అందజేశారు. అనంతరం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని,అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే ఇంతటి అభివృద్ధి జరిగేది కాదని ఆయన అన్నారు. అసలు కేసీఆర్ లేకుంటే మనం ఏమయ్యి పోయే వాల్లమో అని ఆలోచిస్తే భయంగా ఉందని చెప్పారు.

కేసీఆర్ వల్లనే కృష్ణా జలాలు, గోదావరి జలాలు మన ఇంటిలోకి ,మన పొలాల్లోకి వస్తున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వం కావాలని యావత్ దేశ ప్రజలు కోరుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాలు గొప్పగా అభివృద్ధి చెందాయన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని పట్టణాభివృద్ధి తెలంగాణలోనే జరిగిందన్నారు . పట్టణాలలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టిందన్నారు. ఇందుకోసం నూతన మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా రూపొందించి, అమలు చేస్తూ, మున్సిపాలిటీలకు ప్రతీ నెలా నిధులు విడుదల చేస్తున్నదని చెప్పారు. పచ్చదనం అభివృద్ధి కోసం మున్సిపాలిటీల బడ్జెట్ ప్రణాళికలలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించ బడుతున్నదని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రభుత్వం వెజ్, నాన్ వెజ్ సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నదని,టి.ఎస్. బిపాస్ చట్టం అమలుతో ఇండ్ల నిర్మాణాల అనుమతుల ప్రక్రియ సులభతరమైందని అన్నారు. 75 చదరపు గజాల స్థలంలో నిర్మించే ఇండ్లకు అనుమతి అవసరం లేకుండా ప్రభుత్వం చట్టంలో మార్పు తెచ్చి, ఈ ఇండ్లకు నామమాత్రంగా కేవలం 100 రూపాయలు మాత్రమే ఇంటి పన్ను వసూలు చేస్తున్నదని తెలిపారు. అర్బన్ మిషన్ భగీరథ ద్వారా పట్టణాలలో నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీటి సరఫరా చేస్తున్నమని, పట్టణాలలోనూ వైకుంఠ ధామాల నిర్మాణం జరుగుతున్నదన్నారు.
123 పట్టణాల్లో పేరుకుపోయిన లెగసీ వేస్ట్ ను బయో మైనింగ్ ద్వారా ఎరువుగా మార్చే ప్రక్రియ అమలవుతున్నదన్నారు. పట్టణ జనాభాకు మెరుగైన జీవన ప్రమాణాలను, పట్టణ ప్రాంతాలను పరిశుభ్రంగా, పచ్చగా మార్చే లక్ష్యంతో “పట్టణ ప్రగతి” కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో ప్రభుత్వం చేపడుతున్నదని. ఈ మేరకు ఫిబ్రవరి 2020 నుండి మార్చి 2021 వరకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.148 కోట్లు (మున్సిపాలిటీలకు రూ.70 కోట్లు, జీహెచ్‌ఎంసీకి రూ.78 కోట్లు) పట్టణప్రగతి కార్యక్రమం కింద ప్రభుత్వం విడుదల చేస్తోందని. ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 వరకు ప్రతి నెల రూ. 116 కోట్లు (మున్సిపాలిటీలకు రూ. 53 కోట్లు మరియు కి రూ. 59 కోట్లు) విడుదల చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర పట్టణాభివృద్ధి
శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో lమిర్యాలగూడలో మున్సిపాలిటీలో వివిధ పథకాల క్రింద పార్కులు, జంక్షన్లు, సెంట్రల్ లైటింగ్, రోడ్ల వెడల్పు, వంతెనల నిర్మాణాలు, సరస్సుల సుందరీకరణ, వైకుంఠధామాల అభివృద్ధి, ఖబరస్తాన్, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ అభివృద్ధి, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం మొదలైన పనులు చేపట్టి 101 కోట్ల 77 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుచున్నయన్నారు. మిర్యాలగూడ పట్టణంలో మినీ రవీంద్ర భారతి, పూలే భవన్, సంత్ సేవాలాల్ భవన్ లను కూడా పూర్తి చేసుకున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మాట్లాడుతూ మిర్యాలగూడలో తొమ్మిదేళ్లలో ఊహించని అభివృద్ధి జరిగిదన్నారు. అనేక అభవృద్ధి పనులను రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ ఆర్ ప్రారంభించానున్నారని తెలిపారు. తోలుత ఎన్ఎస్పి మైదానంలో తెలంగాణ ఆకారంలో మానవ హారం నిర్వహించి మునిసిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ విష్ణు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, మునిసిపల్ ఇంజనీర్ సాయిలక్ష్మి, ఎఇ ఆశీమ్ బాబా, స్థానిక కౌన్సిలర్లు చైతన్య, దుర్గ సత్యం, స్రవంతి, మున్సిపల్ శాఖ అధికారులు, ఉద్యోగులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking