20 న తెలంగాణ విద్యాదినోత్సవం..

20 న తెలంగాణ విద్యాదినోత్సవం..
విద్యార్థులకు పోటీలు..!

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయం, అన్ని గురుకుల పాఠశాలలు, వైద్య, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తదితర అన్ని విద్యాసంస్థల్లో విద్యాదినోత్సవం వేడుకలు జరుగనున్నాయి. గత తొమ్మిదేళ్లలో విద్యారంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను తెలియజేయనున్నారు.

‘మన ఊరు – మనబడిలో భాగంగా పలు పాఠశాలలను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాటికి ప్రారంభోత్సవం చేయనున్నారు. దాంతో పాటు 10వేల గ్రంథాలయాలు, 1600 డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ను ప్రారంభించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మామిడితోరణాలు, పూలతో అందంగా అలంకరించి విజయోత్సవాలను ఘనంగా జరుపనున్నారు. నిర్వహిస్తారు.

విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి కార్యక్రమం’తో పాటు 1001 గురుకులాలు, హార్టీకల్చర్, ఫారెస్ట్, మహిళ, హెల్త్ యూనివర్సిటీ, జిల్లాకో మెడికల్‌ కాలేజీకి, నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు, జూనియర్‌-డిగ్రీ కాలేజీల (రెసిడెన్షియల్‌ సహా)పై వివరించనున్నారు. విద్యా దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లో విద్యార్థులు ర్యాలీలు తీయనున్నారు. ఆ రోజున పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేసి, తొమ్మిదేళ్ల విద్యారంగంలో పాఠశాల ప్రగతి, విద్యారంగంలో సాధించిన విజయాలు, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. పాఠశాలల్లో యూనిఫారాలు, ట్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల ప్రారంభోత్సవం, అనుబంధ పోషకాహారం కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో, సాంస్కృతిక కార్యక్రమాలు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బందికి సన్మానించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking