శ్రీనివాస్ నగర్ పంచాయతీని సందర్శించిన ఝార్ఖండ్ బృందం

శ్రీనివాస్ నగర్ పంచాయతీని సందర్శించిన ఝార్ఖండ్ బృందం

పల్లె ప్రగతితో చేపట్టిన పనుల పరిశీలన

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామపంచాయతీని ఝార్ఖండ్ రాష్ట్ర జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షలు శుక్రవారం సందర్శించి పల్లె ప్రగతి కింద జరిగిన అభివృద్ధి, నిర్మాణ పనులను పరిశీలించారు. 20 మంది ఉన్న జడ్పి చైర్మన్, వైస్ చైర్మన్ల బృందానికి, జడ్పి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రేమ్ కరణ్ రెడ్డికి ఎంపిపి నూకల సరళ హన్మాంతరెడ్డి, ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి స్వాగతం పలికారు. పల్లెప్రగతి కింద అద్భుత పనులు చేసిన విషయం, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన పంచాయతీగా రాష్ట్ర అధికార యంత్రాంగం గుర్తించి ఝార్ఖండ్ బృందాన్ని శ్రీనివాస్ నగర్ కు పంపినట్టు తెలిసింది. 20 మంది ఉన్న బృందం గ్రామంలోని పల్లెప్రకృతి వనం, గ్రామపంచాయతీ భవనం, గ్రంధాలయం, కరాటే, డాన్స్ శిక్షణ కేంద్రాలు, అవెన్యూ ప్లాంటేషన్, సోలార్ సిస్టం వీధి దీపాలు, చెరువు, వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ ప్లాంట్, వైకుంఠదామం, జిమ్ లను పరిశీలించి అభివృద్ధిని చూసి అబ్బుర పడ్డారు. సంతోషం వ్యక్తం చేశారు.

పల్లె ప్రగతిని ఎంపిడిఓ జ్యోతిలక్ష్మి, సర్పంచ్ బి. వెంకటరమణ చౌదరి క్షుణ్ణంగా వివరించారు. అధికారులు, సర్పంచ్ లను అభినందించారు. సందర్శించిన వారిలో ఇ. సింగ్భూమ్ జడ్పి అధ్యక్షులు భారీ మూర్ము, బొకారో, చాత్ర, ధన్ బాద్, దుంకా, పశ్చిమ సింగ్ బుమ్, ఘర్వ, గుమ్లా, గొద్ద, హాజరీబాగ్, కొడిర్మా, కుంతీ, లేటెహ్హార్, పకూర్, రాంగార్, రాంచి ఉపాధ్యక్షులు సబితా కుమారి, బృజ్ కిషోర్ తివారి, శాంతా దేవి, సుధీర్ కుమార్ మండల్, పంకజ్, అనిత సింగ్, ఎకే. భగత్, రీటాదేవి, మధుశ్రీ మెహెతే, వీణా సింగ్, సత్యనారాయణ యాదవ్, సంయుక్త దేవి, అనుకుమారి, కిషన్ యాదవ్, నిర్మల దేవి. మంజు దేవి, సోని కుమారి, రంజిత్ కుమార్, మహిళ సంక్షేమ శాఖ అధికారి త్రిలోక్ కుమార్ కర్ణ లున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking