ఉస్తెల వీరారెడ్డి ఆశయ సాధనకై కృషి చేయాలి 

*ఉస్తెల వీరారెడ్డి ఆశయ సాధనకై కృషి చేయాలి 

సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు*

చింతలపాలెం, అక్షిత న్యూస్ :
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఉస్తేల వీరారెడ్డి  5వ వర్ధంతిని చింతలపాలెం మండల కేంద్రంలోని కామ్రేడ్స్ సోమిరెడ్డి వెంకటరెడ్డి స్మారక భవనం సిపిఐ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై ఉస్తేల వీరారెడ్డి  విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ చివరి శ్వాస వరకు తన జీవితం కమ్యూనిస్టు పార్టీకి,ప్రజా సేవకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి వీరారెడ్డి  అని అన్నారు.తను ఎంచుకున్న మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.వీరారెడ్డి  జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషిచేసే విధంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తేల నారాయణరెడ్డి, చింతలపాలెం మండల కార్యదర్శి చింతిరాల రవి, మేళ్లచెరువు మండల కార్యదర్శి పాపిరెడ్డి,మండల నాయకులు షేక్ జియాలుద్దీన్, చిత్తలూరి వీరబాబు, భుక్య రామారావు, గొంగరెడ్డి వెంకటరెడ్డి, భీమిశెట్టి సత్యం, చింతలచెరువు కొండలు,శ్రీను, రామారావు, గంధం సీతమ్మ, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking