పొనుగోడు గ్రామ నివాసికి డాక్టరేట్
గరిడేపల్లి, అక్షిత న్యూస్ :
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన బోధ వేణుగోపాల్ రెడ్డికి కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ (కేఎల్ యూనివర్సిటీ) వారు డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. కేఎల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ డాక్టర్ ఏ సృజన డాక్టర్ కే.నరసింహరాజుల పర్యవేక్షణలో ట్రాన్స్ ఫార్మర్ రహిత జనరేటర్ ఆధారిత పవన శక్తి వ్యవస్థ కోసం విద్యుత్ నాణ్యత సమస్యలను తగ్గించడం అనే అశంపై పరిశోధన జరిపారు. ఈ పరిశధనల్లో భాగంగా మూడు అంతర్జాతీయ జర్నల్స్ మరియు రెండు పేటెంట్స్ ను ప్రచురించారు. ఈ సందర్భంగా బోధ వేణుగోపాల్ రెడ్డికి డాక్టరేట్ ప్రదానం చేసి యూనివర్సిటీ వారు అభినందించారు. అదే విధంగా డాక్టరేట్ సాధించిన బోధ వేణుగోపాల్ రెడ్డిని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా బొబ్బ భాగ్యరెడ్డి మాట్లాడుతూ మేధస్సు పట్టణాలలోనే ఉంటుంది అనుకునే ఈ రోజులలో పట్టణాల కంటే పల్లెల నుండి వచ్చే యువత మట్టిలో మాణిక్యంలా తయారవుతున్నారు. అని దేశాభివృద్ధిలో సమాజాన్ని చైతన్యం చేయడంలో కూడా యువత ప్రధాన పాత్ర పోషించాలని అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. తదుపరి బోధ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న చిన్న వయసులో నేనూ డాక్టర్ కావాలని మా నాన్న చాలా బలంగా కోరుకునేవారు అని…ఎన్నో కలలు కనేవారు అని అందుకే నేను వారి కోరికకు విరుద్ధంగా గణితంపై ఉన్న అమితమైన ఇష్టంతో ఇంటర్మీడియటులో యంపీసీ తీసుకున్నాను ఇప్పుడు నేనూ ఎంచుకున్న రంగంలో డాక్టరేట్ పట్టా సాధించి మా నాన్నగారి కోరికను ఈ విధంగా తీర్చాను అని..అన్నాడు.డాక్టరేట్ సాధించిన వేణుగోపాల్ రెడ్డిని గరిడేపల్లి మండలం ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ బీజేవైయం జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బోధ అరవిందరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బోధ సైదిరెడ్డి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మచ్చపోతుల కృష్ణ కాంగ్రెస్ పార్టీ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు నూకల సందీప్ రెడ్డి టిజెఎస్ హుజుర్ నగర్ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు మండల గ్రామ ప్రజలు అభినందించారు.