కూకట్ పల్లిలో ఉచిత వైద్య శిబిరం..
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేపి.హెచ్. బి 4వ ఫేజ్ లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ చైర్మన్ ప్రేమ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిపుణులైన వైద్య సిబ్బందితో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అవసరమైన వారికి ఇక్కడే మందులు పరీక్షలు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

ఈ సదవకాశాన్ని ఎంతో మంది ఉపయోగించుకున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను తమ ట్రస్టు ద్వారా నిర్వహిస్తూనే ఉంటామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గంధం రాజు, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.