26న విద్యా సంస్థల బంద్

జూన్ 26న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్. ఏబీవీపీ.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

జూన్ 26న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం చేయాలని ఏబీవీపీ గ్రేటర్ హైద్రాబాద్ వర్కింగ్ కమిటీ మెంబర్ సనీల్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దశాబ్ది కాలం గడిచిన కూడా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు పూర్తిగా విద్యను నిర్వీర్యం చేసింది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అంటూ ప్రకంపనలు పలికి వారి హామీలను అమలు చేయకుండా రేప్పులైజేషన్ పేరు మీద 8,624 ప్రభుత్వ పాఠశాలలు మూసివేసారని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేవని, 6800 ప్రాథమిక పాఠశాలలో ఓకే టీచరు ఉన్నారని, 596 మండలాల్లో 578 మండలాలకు విద్యా అధికారులు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మన ఊరు మన బడి కార్యక్రమానికి 7 కోట్ల నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తామని హామీలతో చేతులు దులుపుకొని మళ్లీ ఇప్పుడు మరొక నాటకంతో తెరపైకి వచ్చి మళ్లీ 3500 కోట్ల తో పాఠశాలల అభివృద్ధి అంటూ హడావుడి చేసింది అన్నారు. రాష్ట్రంలో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయకుండా మౌలిక వసతులు కల్పిస్తే. ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థికి ఏ విధంగా నాణ్యమైన విద్య అందుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు గాలికి వదిలేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల పిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోవడంలేదని, ఎలక్షన్ ఫండింగ్ లకు అమ్ముడుపోయి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని విద్యార్థి జీవితాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని, అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking