తెలంగాణ ప్రగతి ఇంకెక్కడైనా ఉందా?

కాంగ్రెస్ బిజెపి పార్టీలో పాలిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం తరహా అభివృద్ధి ఉందా ?

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి కూకట్ పల్లి నియోజకవర్గంలో పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నేడు కూకట్ పల్లి నియోజకవర్గంలోని కేపి.హెచ్.బి కాలనీ 9వ ఫేజ్ లో సుమారు 2 ఎకరాల 35 గుంటల స్థలంలో అత్యాధునిక హక్కులతో 11 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్ పార్కు కు కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ గత పాలకుల హయాంలో కాలనీలోని 2.35 ఎకరాల స్థలాన్ని హౌసింగ్ బోర్డ్ విక్రయించేందుకు ప్రయత్నించిందని, ఆ రోజు కోర్టునులో కొట్లాడి ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించాలని నిర్ణయించామన్నారు. మొదటి విడతగా కోటిన్నర రూపాయలతో ప్రహరీ పూర్తి చేసి రెండో విడతగా 9.30 కోట్లతో ఏడాది లోపల పార్కును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే మొదటి మహిళా పార్కును కూడా ఈ డివిజన్లోనే ఏర్పాటు చేసుకున్నామని ఆయన గుర్తుచేశారు. రాబోవు ఎన్నికల్లో తనను ఆశీర్వదించి శాసనసభ్యులుగా గెలిపించాలని కార్యకర్తలు, స్థానికులను కోరారు. 300 కోట్ల రూపాయల స్థలాన్ని పార్కుకు కేటాయించడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking