మధుర స్మృతులు

*పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*

పినపాక, అక్షిత ప్రతినిధి :

ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులేనని 2001 – 2002 నాటి విద్యార్థులు ఈనాటి పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. పినపాక మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో2001 – 2002 మధ్య 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లోనూ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో స్థిరపడిన వారు ఆదివారం మండలంలోని పినపాక హై స్కూల్ నందు ఒకే చోట కలుసుకొని వీడ్కోలు వేడుకలు జరుపుకున్నారు. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం అంటూ ఆనంద భాష్పాలతో వారి గత అనుభవాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్య క్రమంలో ప్రవళిక, రమేష్, రియాజ్,వెంకట చారి, సురేష్,మహేష్,రమ,కోటి, ఉమ,సాంబలక్ష్మి, రాజ్యం, సౌమ్య,సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking