*అంబటి ఇకలేరు*
విజయవాడ, అక్షిత ప్రతినిధి :
నాలుగు దశాబ్దాలుగా వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యుజె మాజీ అధ్యక్షులు, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు కొద్ది సేపటి క్రితమే మృతి చెందడం మీడియా లోకానికి తీరని లోటుగా భావిస్తూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. గత మూడు రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు సర్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.