సమాజ సేవలో “మిర్యాల” లయన్స్ క్లబ్ అగ్రగామి

సమాజ సేవలో మిర్యాలగూడ

లయన్స్ క్లబ్ అగ్రగామి

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

సమాజసేవల్లో మిర్యాలగూడ లయన్స్ క్లబ్ సభ్యులు ముందుంటారని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వైష్ణవి గ్రాండ్ హోటల్ లో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా జరిగిన లయన్స్ క్లబ్స్ మిర్యాలగూడ, లయన్స్ క్లబ్ తరుణ లయన్స్ క్లబ్ భాస్కర కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలకు తాను సంపూర్ణంగా సహకరిస్తారన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసిన ఘనత ఉందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. సేవా కార్యక్రమాలతో మిర్యాలగూడకు పేరు తేవాలన్నారు. ఏరియా జిఏటీ టీడర్ భీమయ్య జగిని నూతన మిర్యాలగూడ, తరుణ, భాస్కర క్లబ్స్ అధ్యక్షులుగా కర్నాటి రమేష్, క్యామా వెంకటేశం, జి. చంద్రకళలతో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి, క్లబ్స్ అధ్యక్షులు కే.అనంతరెడ్డి, భాగ్యలక్ష్మి, పి.రవీందర్ రెడ్డి, పీడీజీలు ఎం. రామానూజాచార్యులు, కేఎన్. ప్రసాద్, ముక్కపాటి వెంకటేశ్వరరావు, డైమండ్ మాశెట్టి శ్రీనివాస్, మాశెట్టి గీత, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు కోల సైదులు ముదిరాజ్, రంగా శ్రీధర్, ఏచూరి మురహరి, కొణతం కృష్ణారెడ్డి, డాక్టర్ మువ్వా రామారావు, సాదినేని శ్రీనివాసరావు, పైడిమర్రి నరసింహారావు, హర్షిత హాస్పిటల్స్ చైర్మన్ కుటాల రాంబాబు, ఎంఈఓ మాలోతు బాలాజీ నాయక్, నరేందర్ బాబు, రైస్ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి రంగా లింగయ్య ఉపాధ్యక్షులు గుడిపాటి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు గార్లపాటి ధనమల్లయ్య, మధుసూదన్ పాల్గొన్నారు.

సీనియర్ జర్నలిస్టులను

సన్మానించిన కర్నాటి రమేష్ 

లయన్స్ క్లబ్ మిర్యాలగూడ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో భాగంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్నాటి రమేష్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఖాజా హామీదుద్దీన్, టియుడబ్ల్యుజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అస్లాoలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్, రీజియన్ చైర్మన్ డైమండ్ మాశెట్టి శ్రీనివాస్, లయన్స్ సభ్యులు, జర్నలిస్టులు ఏ.రమేష్, బి. మట్టయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking