రాజా ఇన్ ఫ్రా మరో విల్లా వెంచర్

రాజా ఇన్ ఫ్రా మరో విల్లా వెంచర్
జూలై 2న ప్రాజెక్ట్ లాంచింగ్

తార్నాక, అక్షిత ప్రతినిధి :
రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ మరో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ లాంచింగ్ చేస్తున్నట్లు రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు తెలిపారు. మంగళవారం తార్నాక రాజా ఇన్ ఫ్రా ప్రధాన కార్యాలయంలో బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ ఒక కొత్త వెంచర్ ను మేడ్చల్ జిల్లా పరిధిలోని రావెల్ కోల్ లో కౌంటీ 2ను జూలై 2న తమ 22 వ వెంచర్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అత్యంత ప్రైమ్ ప్లేస్ లో సామాన్యుడికి అందుబాటు ధరల్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ లాంచింగ్ ఆఫర్ లో అందించనున్నామన్నారు. కస్టమర్ లకు, అసోసియేట్స్ కు లాంచింగ్ రోజున బుక్ చేసుకున్న కస్టమర్స్ కు ఆఫర్స్ ప్రకటించనున్నట్లు చెప్పారు.

ఈ సదవకాశాన్ని కస్టమర్లు, అసోసియేట్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే 21 వెంచర్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని 22వ వెంచర్ లోకి అడుగు పెట్టామని, వేలాది మంది కస్టమర్లకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. కస్టమర్లు పెట్టే పెట్టుబడికి రెట్టింపు… అంతకంటే మిన్నగా అదనపు ఆదాయం రానుందన్నారు. నూతనంగా హాజరైన కొంత మంది బిజినెస్ అసోసియేట్స్ కు రియల్ రంగంలో ఉన్న మెలుకువలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్స్, రాజా ఇన్ ఫ్రా సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking