సివిల్స్ లాంగ్ టర్మ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

బీసీ స్టడీ సర్కిల్ లో సివిల్స్ లాంగ్ టర్మ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

సివిల్ సర్వీసెస్ లాం గ్ టర్మ్ (ప్రిలిమ్స్, మెయిన్స్) ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ వర్గాల్లో డిగ్రీ పాసై 31ఏళ్ల లోపు వయసుకలిగిన అభ్య ర్ధులు ఈ శిక్షణకు జూలై 7వ తేదీ లోగా స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసు కోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు జూలై 16న ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. అయితే వంద మంది అభ్యర్థులను ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 50 మందిని నేరుగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ సమ యంలో భోజన వసతి రవాణా కోసం నెలకు రూ.5 వేలతో పాటు రూ.5 వేల విలువైన పుస్త కాలు స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు. గతంలో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్య ర్థులను నేరుగా ఎంపిక చేస్తామని, వివరాల కోసం 08742-227427, 95738 59598 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking