పేదలకు చేరువగా కృష్ణవేణి
కృష్ణవేణి ఫౌండేషన్ తో సేవలు
అందరి దరికి… విద్యా, వైద్యం
జ్ఞాన మార్గం దిశగా ప్రజా చైతన్యం
తుంగతుర్తి, అక్షిత ప్రతినిధి :
అంబేద్కర్… పూలే వంటి మహనీయుల స్ఫూర్తి. పేదల జీవితాల్లో వెలుగులందించే తపన. అంబేద్కర్ ఆలోచన మార్గంలో పయనం. ఆదర్శ వివాహం అణగారిన వర్గాలకు మేలు చేయాలన్న సంకల్పం.. మహనీయుల స్పూర్తి.. లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ దూసుకుపోతున్న కృష్ణవేణి ఫౌండేషన్ చైర్మన్ ఎస్ కృష్ణవేణి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

జర్నలిస్ట్ నేత సయ్యద్ ఇస్మాయిల్ జీవిత సహచరిగా కృష్ణవేణి ఆయనతో కలిసి రెండు దశాబ్దాలుగా ప్రజలకు చేరువగా ఆరోగ్య సేవలు పలు సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. జర్నలిస్టుగా, ఎంటర్ ప్రైనర్ గా, మీడియా హౌస్ నిర్వాహకురాలిగా ఉంటూ కులవివక్ష, అసమానతలపై పోరాడారు. ఆదర్శ వివాహాలు జరిపించడం మహిళా పారిశ్రామిక వేత్తలకు సహకారం అందించి ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి అవకాశం దక్కేలా చూడటం ద్వారా అనేక మందికి సహకరించారు. చౌరస్తా పత్రిక, టీ లైన్ 24మీడియా హౌస్ స్థాపించి సామాజిక చైతన్యం ప్రజల్లో వ్యాప్తి చేయడమే కాకుండా మార్పు కోసం కృషి చేయాలని సంకల్పించారు. కృష్ణవేణి ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య పరిరక్షణ ఉద్యమం ద్వారా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. తుంగతుర్తి నియోజక వర్గంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తూ పల్లె పల్లెకు వెళ్ళి దళిత, గిరిజన, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల పేదలకు చేరువ కావడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా చైతన్యం, నిరుద్యోగం, విద్యావకాశాలు మెరుగైన వైద్యం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు అంబేద్కర్ జ్ఞాన మార్గంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం కోసం కృషి చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు భవిష్యత్తులో రాజకీయ రంగం వైపు అడుగులు వేయలనుకుంటున్న కృష్ణవేణి ప్రజల ఆదరణ పొందాలని ఆశిద్దాం.