జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకుంటా

*జర్నలిస్టులను కంటికి
రెప్పలా కాపాడుకుంటా

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి :

సమాజంలో ఉన్న అసమానతలను రుగ్మతలను రూపుమాపుతూ సమాజ ఉద్ధరణకు పాటుపడుతున్న జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో ఛైర్మెన్ విఎన్ రాజు అధ్యక్షతన ఏర్పాటుచేసిన మాట = ముచ్చట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. సమాజంలో మార్పుకు మీవంతు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ బ్రతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులు గత కొంతకాలంగా నివాస స్థలాలు కేటాయించాలని తమను కోరుతున్నారని తెలిపారు. జర్నలిస్టుల నివాస స్థలాల కోసం తన వంతు ప్రయత్నంగా జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టానని అన్నారు. ప్రయత్నంలో భాగంగా కొంతమేర సక్సెస్ సాధించడం జరిగిందని, పూర్తిస్థాయిలో అందరి జర్నలిస్టులకు నివాస స్థలాలు ఇప్పించడానికి తాను నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు.

మీ కష్టాలు, బాధలు, జీవనస్థితిగతులు నాకు తెలుసన్నారు. మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు న్యాయం జరిగే వరకూ నావంతు కృషి చేస్తానన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలో ఉండడంతో ప్రభుత్వ స్థలాలు లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అందుకే జిల్లా మంత్రి సహకారంతో పక్క నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న స్థలాలను ఎమ్మెల్యే సహకారంతో పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయత్నలోపం లేకుండా మీకోసం నేను గత మూడు నెలలుగా ఎంతో శ్రమిస్తున్నట్లు తెలిపారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని తాను ఆశిస్తున్నానని మీరు కూడా తనకు అండగా ఉండాలని కోరారు. ఫలితం అనుభవించే వరకు మీ జేఏసీ నిరంతరం ఇలాగే క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. రెండు మూడు రోజులలో జిల్లా మంత్రి సబితఇంద్రారెడ్డితో తేనేటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మన సమస్యను ఆమె దృష్టిలో పెట్టి పరిష్కారం కోసం కృషి చేసుకుందామని సూచించారు. అనంతరం జర్నలిస్టులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. జర్నలిస్టులు వారి కుటుంభసభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సుధీర్ రెడ్డికి అక్షిత డైరీ

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక నూతన డైరీని
ఎల్బీనగర్ స్టాఫ్ రిపోర్టర్ ఎం. స్ఫూర్తి అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్షిత బృందం కానుకుర్తి వినయ్ కుమార్, సృజన్ కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking