గణేష్ పహాడ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
* కుటుంబ సభ్యులను పరామర్శించిన యువనేత సిద్దార్ధ
* రూ.5వేలు ఆర్థిక సాయం అందజేత
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో గణేష్ పహాడ్ గ్రామానికి చెందిన కొర్ర స్వాతి (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి మృత దేహాన్ని తరలించారు. విషయం తెలుసుకున్న యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5వేలు ఆర్ధిక సాయం అందజేశారు. సిద్దార్ధ వెంట సర్పంచ్ సైదు నాయక్, బండి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.