వీర్కో ఫౌండేషన్ తో… పాఠశాలకు శోభ

సిఎస్ ఆర్ నిధులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన. అడిషనల్ కలెక్టర్…

మేడ్చల్, అక్షిత బ్యూరో: దుండిగల్ పురపాలక పరది లోని గాగిల్లాపూర్ గ్రామంలో వీర్కో ఫౌండేషన్ సిఎస్ ఆర్ నిధుల ద్వారా ఒక్క కోటితో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య విర్కో సీఈవో ప్రవీణ స్థానిక కౌన్సిలర్. కుంటి నాగరాజు అరుణ తో కలిసి నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ సి ఎస్ ఆర్ నిధులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అందుబాటులోకి తీసుకురావడం హర్షణీమమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ఎంఈఓ ఆంజనేయులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ టీచర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking