*ఆత్మీయ సమ్మేళనo పేరుతో
భగ్గుమన్న బిఆర్ఎస్ అసమ్మతి*
వర్గపోరుతో మునగనున్న
బి ఆర్ఎస్ పడవ
3000 మందితో ఘనంగా ఆత్మీయ సమ్మేళనo
మాదిగలపై వివక్ష చూపుతున్న ఎమ్మెల్యే ఏకమైతున్న మాదిగ జాతి
తుంగతుర్తి, అక్షిత ప్రతినిధి : తుంగతుర్తిలో గులాబీ చిచ్చు రగులుకుంది. ఇరువురు నేతల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. చివరకు గులాబీకి గుడ్ బై పలకావల్సిన పరిస్థితి దాపురించింది.
ఓ ఉద్యమ నేత… తెలంగాణ సాధన పోరులో తమ వంతు పాత్ర పోషించిన నేతగా మందుల సామేల్ గట్టి పట్టునప్పటికి బిఆర్ ఎస్ నుంచి మళ్లీ మొండి చెయ్యిలా మిగలనుంది. తుంగతుర్తి మండలంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ … తుంగతుర్తి నియోజకవర్గం లో మాదిగల ఓట్లు 70 వేల వరకు ఉన్నాయి. అయినా మాదిగ జాతికి చెందినటువంటి మందుల సామేలుకి మూడోసారి కూడా మొండిచేయి చూపించటం సరైన పద్ధతి కేసీఆర్ ది కాదని తెలియజేశారు. ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేలు ఎన్నో అలుపెరుగని ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ పార్టీకి ఎంతో సేవ చేశారని ఇలాంటి సేవలను మరిచి గాదరి కిషోర్ కుమార్ కి టికెట్ కేటాయించటం మాదిగలను మోసం చేసినట్లే అని సూచించారు.

ఈసారి మందుల సామేలు తుంగతుర్తి నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపించి గాదరి కిషోర్ కుమార్ కి కెసిఆర్ కి తగిన గుణపాఠం చెప్పాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకి సవనియంగా కోరుకుంటున్నానని అన్నారు.
మందుల సామేలు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కోసం నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టానని మాకు సేవకు తగ్గ స్ధానం కేసీఆర్ ఇవ్వలేదని కేసీ అర్ ప్రభుత్వంలో మాదిగలకు అవమానాలు కుల వివక్షతకు గురవుతున్నారని అందుకే అవమానం భరించలేక నేను బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని నేనే కాదు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్లు, డబ్బులు పెట్టి నష్టపోయిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎందరో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళందరితో కలిసి బి ఆర్ఎస్ పార్టీ మీద మేము పోరాటం చేయుటకు సిద్ధమై ఇక నుండి మీ కళ్ళముందే ఉండి మీ సమస్యలు తీర్చడం కోసం మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించి ఆదుకోవాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మండల నాయకులు టిఆర్ఎస్ అసమ్మతి వర్గం నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.