ప్రశ్నించే గొంతుల అణిచివేత !

ప్రశ్నించే గొంతులను అణిచివేయడం ప్రజాస్వామ్యమా?

-తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఐ టి సి ఎనిమిదవ మిషన్ పబ్లిక్ హియరింగ్ 14 న జరుగుతుండడంతో సారపాక లో చాలామందిని అరెస్టు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ఉదయం 6 గంటలకు తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ ని గృహనిర్బంధంలోకి తీసుకోన్నారు.ఇది ప్రజాస్వామ్యమా? ఐటీసీ ఎనిమిదో విస్తరణ పనుల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగి ప్రజల ఆరోగ్యము క్షీణిస్తుందని మేము మొదటినుంచి హెచ్చరిస్తూనే ఉన్నాము. కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారం కావాలి అని తెలంగాణ రక్షణ సమితి డిమాండ్ చేస్తున్నది.
సారపాక ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. పెట్టుబడులు రావాలి. ఉద్యోగ అవకాశాలు రావాలి అని తెలంగాణ రక్షణ సమితి కూడా కోరుకుంటుంది.
కానీ ఎనిమిదో మిషన్ విస్తరణ పనుల వల్ల వెలువడే కాలుష్య నివారణకు పూర్తిస్థాయి అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని తెలంగాణ రక్షణ సమితి కోరుకుంటుంది.
ఐటీసీ నుండి వెలువడే వ్యర్ధాల వల్ల గోదావరి ప్రాంతం కలుషితమై ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.సారపాక నుండి యువకులు మాజీ సర్పంచ్ అందరూ కూడా పబ్లిక్ హీరింగ్ కు వస్తుంటే వారిని ఎందుకు అరెస్టు చేసినట్లు పర్యావరణ శాఖ కాలుష్య నివారణ శాఖ ప్రభుత్వ యంత్రాంగం గాని గ్రామాలలో బాక్సులను ఏర్పాటు చేస్తే ఖచ్చితమైన ప్రజాభిప్రాయం తెలుస్తుంది.మొక్కుబడిగా పబ్లిక్ హియరింగ్ పెట్టడాన్ని తెలంగాణ రక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తున్నది.ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు అస్తమా ఉబ్బసం శ్వాస కోస వ్యాధులు కిడ్నీ సమస్యలు చర్మ సమస్యలు కండ్ల సమస్యలు, క్యాన్సర్ సమస్యల తో ఇబ్బంది పడుతున్నారు.ప్రజా ఆరోగ్యము దృష్ట్యా 8వ మిషన్లో వాడే అధునాతన టెక్నాలజీతో నిర్మించిన యంత్రాలను ఉపయోగించి కాలుష్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking