మిర్యాలగూడ, తిప్పర్తి రైల్వే స్టేషన్ల తనిఖీ చేసిన డిఆర్ఎం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ-నల్లగొండ రైలు మార్గంలో ఆదివారం మిర్యాలగూడ, తిప్పర్తి రైల్వేస్టేషన్లు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ రామకృష్ణ తనిఖీ చేసి తిప్పర్తి వద్ద కార్గో టెర్మినల్ ను ప్రారంభించారు. సాయి బాలాజీ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ను సందర్శించి కార్గో టెర్మినల్ ను ప్రారంభించారు.

సర్వీస్ స్టేషన్ నుండి 1.9కిలోమీటర్ దూరంలో ఉన్న టెర్మినల్ నుండి దేశంలోని వివిధ రాష్ట్రలకు ఆహార ధాన్యాలను రవాణా చేయనున్నట్టు డిఆర్ఎం తెలిపారు. ఆదివారం తిప్పర్తి నుండి కర్ణాటక రాష్ట్రంలోని కొరుక్కుపేటకు మొదటి రాక్ 42 వాగన్లలో 2,745 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం రవాణా చేశారు. దీని వల్ల రూ.25.23లక్షల ఆదాయం చేకూరిందని, సంవత్సరంలో 60 రాకులు రవాణా చేయనున్నామని సంవత్సరానికి రూ.15కోట్ల ఆదాయం వస్తుందాన్నారు. కార్గో ప్రారంభం వల్ల గుంటూరు డివిజన్ కు ఆదాయం పెరగ నున్నదని ఆయన అన్నారు. ఇంకా రాక్లలో లోడింగ్ చేయించాలని ఎస్బిడబ్లుటీ నిర్వాహకులను కోరారు. ఆయన వెంట సీనియర్ డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్ పి. కిరణ్ కుమార్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు, ఎఎస్టీఇ శరత్, జెవిబి అదేన్ లున్నారు.