*డ్రగ్ రెసిస్టెన్స్ మలేరియానా కొత్త రకం కావచ్చునా?*
*ఎంజీఎం వైద్యులను తొలుస్తున్న ప్రశ్న*
*. పాత ద్రమ్ముల్లో,గొలాల్లో,చిన్న చిన్న మురికి కుంటల్లో నీటి నిలువలు లేకుండా చూడాలి మునిసిపల్ అదికారులు*
వరంగల్,అక్షిత బ్యూరో :
వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ 15నెలల చిన్నారి మృతి… అసాధారణ వైద్యానికి లొంగని మహమ్మారి. కొత్తరకమని నిర్ధారించలేం.. ఉన్నత పరిశోధనల్లోనే తేలాలి. ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వివరణ ప్రకారం వరంగల్ డ్రగ్ రెసిస్టెన్స్ మలేరియా ఉందా? అనేది ఇప్పుడు ఎంజీఎం వైద్యులను తొలుస్తున్న ప్రశ్న ఇది. కుక్క కాటు బారిన పడి 25రోజులపాటు ఎంజీఎంలో చికిత్స పొందుతూ 15 నెలల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. ఎంజీఎం వైద్యులు చేసిన విశ్లేషణలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. వరంగల్లో పెరుగుతున్న మలేరియా కేసులతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఆ అవసరముందని వైద్యవర్గాలు సూచిస్తున్నాయి. కాజీపేట మండలంలోని కడిపికొండ రాజీవ్ గృహ కాలనీలో ఆడుకుంటున్న 15నెలల చిన్నారి డేవిడ్ రాజ్ పై జూన్ 17న కుక్క దాడి చేసింది.

తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. 25 రోజుల పాటు చికిత్స పొంది ఈ చిన్నారి మృతి చెందాడు. చిన్నారి మృతికి కారణం మలేరియా అని నిర్ధారించుకున్నారు. అయితే చిన్నారి మృతికి కారణం కొత్తరకం మలేరియా అనే అనుమానం ఎంజీఎం వైద్యుల్లో మొదలైంది. ఎంజీఎంలో చేరిన డేవిడ్ రాజ్కు మలేరియా ఎలా వచ్చింది.? ఎంజీఎంలో మలేరియా దోమలు ఉన్నాయా..? లేక ఇంటిదగ్గర కుట్టిన దోమతో చిన్నారికి. లో డ్రగ్ రెసిస్టెన్స్ మలేరియా ? వరంగల్ డ్రగ్ రిసిస్టన్స్ మలేరియా ఉందా? ఇప్పుడు ఎంజీఎం వైద్యులను తొలుస్తున్న ప్రశ్న ఇది. కుక్కకాటు బారిన పడి 25రోజులపాటు ఎంజీఎంలో చికిత్స పొందుతూ 15 నెలల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. ఎంజీఎం వైద్యులు చేసిన విశ్లేషణలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. వరంగల్ పెరుగు తున్న మలేరియా కేసులతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయా.? అంటే ఖచ్చి తంగా ఆ అవసరముందని వైద్య వర్గాల నుంచి సూచనలు వస్తున్నాయి. కాజీపేట మండలంలోని కడిపికొండ రాజీవ్ గృహ కాలనీలో ఆడుకుంటున్న 15 నెలల చిన్నారి డేవిడ్ రాజ్ పై జూన్ 17న కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. 25రోజుల పాటు చికిత్స పొంది ఈ చిన్నారి మృతి చెందాడు. అయితే సుమారు 25 రోజుల పాటు చికిత్స అందించిన చిన్నారి మృతి చెందడంతో ఎంజీఎం వైద్యులకు చిన్నారి మృతి పైన విశ్లేషణ చేస్తున్నారు. చిన్నారి మృతికి కారణం మలేరియా అని నిర్ధారించుకున్నారు. అయితే చిన్నారి మృతికి కారణం కొత్తరకం మలేరియా అనే అనుమానం ఎంజీఎం వైద్యుల్లో మొదలైంది. కుక్క కాటుకు గురై ఎంజీఎంలో చేరిన చిన్నారి డేవిడ్ రాజ్కు వైద్యులు వెంటనే చికిత్స అందించారు. మంచి యాంటీ బ్యాటిక్ ఇవ్వగా పది రోజుల తర్వాత కొంత కోలుకున్నట్లు కనిపించినా జ్వరం మాత్రం తగ్గలేదు. కుక్కకాటు చికిత్సతోపాటు రేబిస్ సోకకుండా యాంటీ బయోటిక్స్ మందులు అందించారు. కుక్క కాటుకు ఇవ్వాల్సిన కోర్స్ పూర్తయిన తరువాత పెరిగిన జ్వరంతో మరోసారి అస్వస్థతకు గురయ్యాడు డేవిడ్ రాజ్, దీంతో ఎంజీఎం వైద్యులు అన్ని టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో మలేరియా ఉందని నిర్ధారణ అయింది. మలేరియాకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా కొన సాగించారు. అయినా చిన్నారి మృతి చెందాడు.. చిన్నారి మృతి ఎంజీఎం వైద్యులను ఆలోచింపచే స్తోంది. వరంగల్ ఎంజీఎంలో చేరిన డేవిడ్ రాజ్కు మలేరియా ఎలా వచ్చింది.? ఎంజీఎంలో మలేరియా దోమలు ఉన్నాయా..? లేక ఇంటిదగ్గర కుట్టిన దోమతో 15నెలల చిన్నారికి మలేరియా.. వచ్చిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వైద్యుల మెదళ్లను తొలుస్తున్నాయి.
మలేరియా ట్రీట్మెంట్ ఎందుకు పని చేయలేదు
ఎంజీఎంలో అయినా ఇంటి దగ్గర కుట్టిన దోమతో చిన్నారి మలేరియా బారిన పడినా మలేరియాకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఎందుకు పని చేయలేదు.. వరంగల్ లో డ్రగ్ రెసిస్టెంట్ మలేరియా ఉండా అనే అనుమానాలు ఇప్పుడు ఎంజీఎం వైద్య వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 15 నెలల చిన్నారి మలేరియూతో చనిపోవడంతో వరంగల్లో డ్రగ్ రెసిస్టెన్స్ మలేరియా దోమలు ఉన్నాయని అనుమా నాన్ని కలిగించింది. ఇటీవల మలేరియా మందులకు లొంగకుండా రోగాన్ని పెంచుతున్నట్లు మలేరియా వస్తోందన్న కొత్త అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో డేవిడ్ రాజు మృతికి గల కారణాలు డ్రగ్ రెసిస్టెన్స్ మలేరియా కారణమనే అభిప్రాయాలు వైద్య వర్గాల్లో నెలకొన్నాయి. అధ్యయనం చేయాల్సిందేనా
*కొత్త రకమని నిర్ధారించలేం* పరిశోధనల్లోనే కుక్క కాటుతో ఆస్పత్రిలో చేరిన డేవిడ్ రాజుకు రెబిస్ సోకకుండా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చాం. డిశ్చార్జి సమయంలోనూ జ్వరం ఉండడంతో మళ్లీ ఒకసారి అన్ని టెస్ట్లకు చేశాం. అయితే పరీక్షల్లో మలేరియాగా నిర్ధారణ అయిన తర్వాత ఉన్నతమైన వైద్యం అందించాం. అయినా పరిస్థితి మారలేదు. మల్టీ కాంప్లికేషన్స్ ఏర్పడ్డాయి. జ్వరం. శ్వాసం తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో మృతి చెందాడు. సాధారణ పరి స్థితికి చాలా భిన్నంగా డేవిడ్ రాజు కేసును చూడల్సి వస్తోంది. వరంగల్ లో డ్రగ్ రెసిస్టెన్స్ మలేరియా ఉందా? అనే సందేహాలు కలుగుతున్న మాట వాస్తవమే. కానీ కొత్తరకమని నిర్ధారించలేం. అత్యున్నత పరిశోధనల్లోనే ఇది తేలాల్సి ఉంటుంది అని అన్నారు.
*చంద్రశేఖర్, సూపరింటెండెంట్, ఎంజీఎం*
నివారణ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో వరంగల్ ఎంజీఎంలో కూడా దోమల నివారణకు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు కనిపి స్తున్నాయి. మరో వైపు గ్రేటర్ వరంగల్ పరిధిలో డ్రగ్ రెసిస్టెన్స్ మలేరియా దోమలు ఉన్నాయా? అనే దానిపై అధ్యయనం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ లో మలేరియా డెంగీ కేసులు పెరుగుతున్నాయి అధికార యంత్రాంగం వెంటనే దీని పైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితుల కని పిస్తున్నాయి. ఎంజీఎం అధికారులు సైతం డ్రగ్ రెసిస్టెన్స్ మలేరియా పై అధికారులకు అవగాహన కలిపించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.రాష్ట్ర ప్రజలకు దీని పై పూర్తి క్షేత్ర స్థాయి ప్రాథమిక, పట్టణ అంగన్వాడీ, ఆషా,అరోగ్య కార్యకర్తలతో పూర్తి స్థాయిలో పాఠశాలలలో,గురుకుల విద్యాలయాల లో సైతం అవగాహన కల్పించాలి.