పకడ్బందిగా ఓటర్ల నమోదు చేపట్టాలి

పకడ్బందిగా ఓటర్ల
నమోదు చేపట్టాలి

*ఆర్డిఓ చెన్నయ్య

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, బిఎల్ఓ, ఎపిపి తదితర విషయాలపై స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం బూత్ లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్ కు శిక్షణ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక ఆర్డిఓ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ బి.చెన్నయ్య ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, అర్హత కలిగిన ఏ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధమని అందుకే స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్ -2) టు ఏర్పాటు చేసి బిఎల్ఓ లకు మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, ప్రతి బిఎల్ఓ తమ ప్రాంతంలో ఉన్న అన్ని విషయాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండి ఫామ్ 6, 7, 8 లకు సంబంధించిన ఓటర్ల నమోదుపై అవగాహన ఏర్పరచుకొని క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పులు లేని ఓటర్ల జాబితాను నమోదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ తహసిల్దార్ ఎం.అనిల్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ కల్పన, ఎస్ఎ జానిషరీఫ్, రెవిన్యూ డివిజన్ కార్యాలయ సిబ్బంది సందీప్, సత్యనారాయణ, ఎండి.జమాల్ , శ్యాంసుందర్ రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్ బాలు, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు గుడిపాటి కోటయ్య, అంబటి శ్రీను, రాజు, రామచంద్రు, సైదులు, జనార్ధన్, సైదిరెడ్డి, వెంకటరెడ్డి సూపర్వైజర్లు, బిఎల్ఓలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking