జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం విజయవంతం చేయాలి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నేడు (జూలై 20) న నిర్వహించ నున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినంను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయ వంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం నిర్వహణపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 1-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను నమిలి మింగించాలని కోరారు.

నేడు జూలై 20 న జిల్లాలోని అన్ని అంగన్ వాడి కేంద్రాలలో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు,హాస్టల్స్ నందు ఒకటవ సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయస్సు గల వారికి అల్బెండజోల్ మాత్రను నమిలి మింగించాలని, 1 నుండి 2 సంవత్సరాల వయస్సు గల వారికి నీటితో కలిపి సగం మాత్ర, 2 నుండి 3 సంవత్సరాల వయస్సు గల వారికి నీటితో కలిపి పూర్తి మాత్రను, మిగిలిన వయస్సు గల వారికి పూర్తి అల్బెండజోల్ మాత్ర (400 యం.జి) ని వేయాలని, ఈ మాత్ర సురక్షితమైనదని, ఎలాంటి సమస్యలు తలెత్తవు అని అన్నారు.ఈ కార్యాక్రమ నిర్వహాణకు అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లాలోని 3,88,222 మంది పిల్లలకు మాత్రలు అందించుటకు 4,49,000 అల్బెండజోల్ మాత్రలను అందించుటకు సిద్దంగా ఉంచాము అని అన్నారు. ఇక వేళ నేడు జూలై 20 న మిగిలిన వారు వుంటే జూలై 27 న మాప్ అప్ రౌండ్ లో బాగంగా వారికి మాత్రలు వేయటం జరుగుతుందని అన్నారు. జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి అబ్దుల్ జమీర్ మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగులతో శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని, రక్తహీనత, చదువుపై శ్రద్ద తగ్గడం, చిరాకు, మతి మరపు లాంటి లక్షణాలు ఉంటాయని అన్నారు.

నులి పురుగుల నిర్మూలనకు మాత్ర నమిలి మింగటంతో పాటు అదనంగా నులి పురుగుల సంక్రమణ వ్యాప్తిని నిరోదించటానికి, పరిసరాల పరిశుభ్రత, పాదరక్షలు ధరించుట, మరుగుదొడ్డి వాడుట, చేతులను శుభ్రంగా కడగడం, పండ్లను, కూరగాయలను కడుగుట, ఆహారంపై మూతను ఉంచుట, పరిశుభ్రమైన నీరును త్రాగుట, గోర్లను చిన్నవిగా ఉంచుకొనుట చేయాలి అని అన్నారు. ఇట్టి కార్యక్రమములో పిల్లలకు మాత్రలను వేయుటకు,తల్లి దండ్రులు ఉపాద్యాయులు సహాకరించాలని కోరారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking