శిలాఫలకానికే పరిమితమైన కెజిబివి భవననిర్మాణం*

*శిలాఫలకానికే పరిమితమైన
కెజిబివి భవననిర్మాణం*

*వేములపల్లికి చేరుకున్న ఎస్ఎఫ్ఐ సంఘర్షణ సైకిల్ యాత్ర

వేములపల్లి, అక్షిత ప్రతినిధి :

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంఘర్షణ సైకిల్ యాత్ర బుధవారం వేములపల్లి మండలకేంద్రానికి చేరుకుంది. ప్రజాసంఘలనాయకులు సంఘీభావం తెలిపి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ పాదూరి గోవర్థని శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులనుకాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర బృందం దృష్టికి వచ్చిన సమస్యలన్నిటిని జిల్లా కలెక్టర్పరిశీలించి పరిష్కారమార్గం చూపాలన్నారు. మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలకు సొంత భవనం లేక 300 మంది పేద విద్యార్థినిలు అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు శిలాఫలకం వేసి కొబ్బరికాయలు కొట్టడంతోనే పరిమితం చేశారన్నారు. ఇప్పటివరకు కేజీబీవీ పాఠశాల నిర్మాణపనులు ప్రారంభించకపోవడంతో పేదవిద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. మండలానికి మండల విద్యాధికారి లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించకుండా పాఠశాల హెడ్మాస్టర్లు విద్యార్థులకు రావలసిన మెనూను పక్కదారి పట్టిస్తున్నారన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మం పార్టీ శంకర్ జిల్లా సహాయ కార్యదర్శులు సైదానాయక్ లక్ష్మణ్ నాయక్ వెంకటేష్ రమేష్ జగన్ వీరన్న సంపత్ సాయి చందు నవదీప్ ఉన్నారు.యాత్ర బృందానికి స్వాగతం పలికిన వారిలో ఎంపీటీసీ చల్లబొట్ల చైతన్య, సీఐటీయూ జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్,డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను,నాయకులు వడ్డెగాని సైదులు,రేనయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking