చిరుమర్రి రమణయ్యకు మాతృవియోగం

చిరుమర్రి రమణయ్యకు మాతృవియోగం

పలువురు పరామర్శ
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరుమర్రి రమణయ్య మాతృమూర్తి చిరుమర్రి దేవకమ్మ ( 90) గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతిచెందడంజరిగింది.విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తనయుడు ఎన్ బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్ధ స్థానిక నాయకులతో కలిసి దేవకమ్మ పార్ధివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ లు చిర్ర మల్లయ్య యాదవ్, మజ్జిగపు పద్మ సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్ కట్టా మల్లేష్ గౌడ్, సహకారసంఘం చైర్మన్ నక్కా శేఖర్, బిఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండి షోయబ్, సహకారసంఘం మాజీ చైర్మన్ కాట్రగడ్డ రాజ గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.


బత్తుల లక్ష్మారెడ్డి పరామర్శ

వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన చిరుమర్రి దెవకమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న సామాజికవేత్త మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య తమ్మడబోయిన అర్జున్ రావు ఎల్లారెడ్డి పుట్టల కృపయ్య నాగవెళ్లి మధు రేగట్టె రవిందర్ రెడ్డి మాలి కాంతారెడ్డి పల్లా వెంకటయ్య ,తోపాటు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking