కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్ వి కర్ణన్

కలెక్టర్ గా బాధ్యతలు
స్వీకరించిన ఆర్.వి. కర్ణన్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా అర్.వి. కర్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అర్.వి. కర్ణన్ నల్గొండ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవియంల ప్రదర్శన కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వికరించిన జిల్లా కలెక్టర్ ను జిల్లా అధికారులు జడ్.పి.సి. ఈ.ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డి.అర్.డి. ఓ కాళిందిని,డి.పి. ఓ విష్ణువర్ధన్ రెడ్డి,డి.ఎస్.ఓ వెంకటేశ్వర్లు,డి.పి.అర్. ఓ.పి. శ్రీనివాస్, ఎస్.సి.కార్పొరేషన్ ఈ.డి.ఎల్.శ్రీనివాస్, గనులు, భూగర్భ శాఖ ఏ .డి.వెంకటేశ్వర్ రావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ. డి.శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతీ లాల్. సిబ్బంది, జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking