నారు ఎదిగే నీరు లేక పాయే
గరిడేపల్లి, అక్షిత న్యూస్ :
వర్షాలు అనుకూలంగా పడడంతో గరిడేపల్లి మండలంలో ఆయకట్టులోని రైతులు వరి నార్లను పెంచుతున్నారు. నీటి ఆధారం ఉన్న రైతులు జోరుగా నాట్లు సాగర్ నీటి మీద ఆధారపడ్డ రైతులు అయోమయంలో పడుతున్నారు. జలాశయాలలో సరిపడా నీళ్లు లేకపోవడంతో నీళ్లు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఎగువ ప్రాజెక్టులలో నీరు చేరడంతో కొంత ఆశాజనకంగా ఉన్నా సాగర్ జలాశయం ఎప్పుడు నిండుతుందా సాగర్ కాల్వకు ఎప్పుడు నీరు ఏడుస్తారా అని ఎదురుచూస్తూ అయోమయంలో ఉన్నారు. వర్షాకాలం వెనకకు నాట్లు వేస్తే వేసంగి కాలంలో మళ్లీ ఆలస్యం అవుతుందని సందిగ్ధంలో ఉన్నారు. కొందరు రైతులు మెట్టవారిని కూడా సిద్ధం చేయడం జరిగింది.