ఐఐటీ విద్యార్థికి అభినందన
దామరచర్ల, అక్షిత న్యూస్ :
దామరచర్ల మండలం బెట్టతండ గ్రామానికి చెందిన లావూరి బాలాజీ ఐఐటీ పరీక్షలో జాతీయ స్థాయిలో గిరిజన కేటగిరీలో 696 ర్యాంక్ సాధించి ఐఐటి జమ్మూలో కంప్యూటర్ సైన్స్ సీట్ సాధించగా శుక్రవారము జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ముడంబై రామానుజాచార్యులు అభినందించారు. పేద తల్లిదండ్రులు లేని అనాధ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదవి ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు. బాలాజీకీ మంచి భవిష్యత్ ఉందని ఆయన చదవుకు తన వంతు సహాయం చేసి కోర్స్ పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మలోత్ దశరథ్ నాయక్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళీ యాదవ్ తదితులున్నారు.