ఖమ్మం నగరంలో ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
వాతావరణ శాఖ అధికారులు పదేపదే భారీ వర్షాలపై సూచనలు చేసినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.ప్రభుత్వ వైఫల్యం వల్లనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పాలనను పూర్తిగా మర్చిపోయింది.పరిపాలనకు సంబంధించిన అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు వద్దనున్న మంచికంటినగర్, బొక్కల గడ్డ కాలనీలోని ప్రజలు పడుతున్న భాధ నేను కళ్లారా చూసాను. ఇప్పటివరకు అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేయలేదు. కనీసం ముంపు భాదితులను కలసి వారికీ భరోసా కూడా కల్పించకపోవడం అత్యంత దురదృష్టకరం.అధికార యంత్రాంగాన్ని ప్రజల కోసం పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హితవు పలికారు. అధికార యంత్రాంగాన్ని బీఆర్ఎస్ పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పని చేసేలా చూడాలని భట్టి విక్రమార్క చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా ముంపుకు గురైన అన్ని ప్రాంతాల్లో అధికారులు పర్యటించి నష్టాన్ని అంచనా వేయడంతో వాటు వారికి పరిహారాన్ని అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ల దుర్గ ప్రసాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ బీసీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం బొడ్డు బొందయ్య కార్పొరేటర్లు మలీద్ వెంకటేశ్వర్లు సైదులు నాయక్ దుద్దుకూరు వెంకటేశ్వర్లు స్థానిక డివిజన్ అధ్యక్షులు జానీ మియా షేక్ రజ్జి ఎస్టీ సెల్ నాయకులు శంకర్ నాయక్ మైనార్టీ నాయకులు ముజాహిద్ హుస్సేన్ అబ్బాస్ శ్రీశైలం యాదవ్ సాధు శంకర్ పర్వత శ్రీనివాస్ వైరా పీసీసీ మెంబర్ వడ్డీ నారాయణరావు రాందాస్ నాయక్ రాష్ట్ర కిసాన్ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్ హలో డివిజన్లకు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.