చిరుదాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

*చిరుదాన్యాలతో
సంపూర్ణ ఆరోగ్యం

బిజెపినేత మురళీధర్ రావు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

2023ను ఐక్యరాజ్యమితి అంతర్జాతీయ చిరుధాన్యాలు సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగం, ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేసేందుకు శుక్రవారం హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎఫ్ సిఐకాలనీలో పివిఆర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పాల్నాటి వెంకట్ రెడ్డి ఆర్థిక సహకారం, నయామిల్లెట్స్, సౌజన్యంతో చిరుధాన్యాలు, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు చిరుదాన్యాలతో అల్పాహారం విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్య్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్రఇంఛార్జి మురళీధరావు ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపద్యంలో మారుతున్న కాలంతోపాటు ఆహారపదార్థాల వినియోగం మారిపోయిందన్నారు.

మార్కెట్ లో లభించే జంక్ ఫుడ్ తోఆరోగ్యం క్షీణీస్తోందన్నారు. దింతో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వడం మాములేన్నారు.మనపూర్వీకుకులు అనుసరించిన ఆహారపు అలవాట్లు చిరుధాన్యాలయిన కొర్రలు జొన్నలు రాగులు తదితర పప్పు చిరుదాన్యాలను రోజువారీ ఆహారంలో తీసుకోవడంతో సంపూర్ణఆరోగ్యంపొందవచ్చునన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అనుసరించిన యోగ పద్ధతులను నేడు యావత్ ప్రపంచం ఆచరిస్తుందన్నారు. ఇదేవిధంగా రాబోయే రోజుల్లో మన ఆహారపు అలవాట్లలో చిరుధాన్యాల వినియోగం పెరుగుతుందన్నారు. చిరుధాన్యాల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన బిజెపి నేత పివిఆర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పాల్నాటి వెంకట్ రెడ్డిని అభినందించారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి వెంకట్ రెడ్డి కాలనీ అధ్యక్షుడు రాంరెడ్డి మహిళమండలిఅధ్యక్షురాలు సునీత అమర్ రఘు లతోపాటు హైదరాబాద్ నగరంలోని పలుకాలనీలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు వివిధసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా 400మందికి చిరుదాన్యాలతో కూడిన అల్పాహారం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking