నిరుపేద విద్యార్థికి ఆపన్న హస్తం
* జమ్ము కాశ్మీర్ ఐఐటీలో 689వ ర్యాంక్ సాధించిన లావూరి బాలాజీ
* గిరిపుత్రుడికి అండగా నిలిచి రూ.50వేలు ఆర్థిక సాయం
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
నిరుపేద గిరిజన విద్యార్థికి మిర్యాలగూడ శాసనసభ్యుడు నల్లమోతు భాస్కర్ రావు ఆపన్న హస్తం అందించి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో బెట్టే తండాకు చెందిన స్వర్గీయ భద్రు నాయక్ కుమారుడు లావూరి బాలాజీ నాయక్ జమ్ము కాశ్మీర్ ఐఐటీలో 689వ ర్యాంక్ సాధించాడు. ఐఐటీలో చేరేందుకు ఆర్ధిక స్తోమత లేకపోవడంతో బాలాజీ నాయక్ కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తక్షణమే స్పందించారు. మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బాలాజీ నాయక్ ను పిలిచి ఆశీర్వదించారు. బాలాజీ నాయక్ కు రూ.50 వేలు ఆర్ధిక సాయం అందించారు. కష్టపడి చదవాలని ఎల్లప్పుడూ అండగా ఉంటానని భాస్కర్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తిపాటి నవాబ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, ఎన్బీఆర్ ఫౌండేషన్ సభ్యులు తిరుమలగిరి వజ్రం, కోటేశ్వర్ రావు, శ్రవణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.