మానవ మనుగడకు
మొక్కలు ఆధారం
బిఎల్ఆర్ ఆధ్వర్యంలో 20వ వార్డులో మొక్కల పంపిణి
బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మానవ మనుగడకు మొక్కలు ఆధారం.మున్సిపల్ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 20వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ మాట్లాడుతూ ప్రతి జీవి మనుగడకు మొక్క ఆధారమని మొక్కల్ని పెంచడం వల్ల పర్యావరణ సమతుల్యత జరుగుతుందని నానాటికి అడవులను నరుక్కుంటూ పోవడం వల్ల పర్యావరణం అనేది దెబ్బతిని సకల జీవరాశులకు ప్రమాదం ఏర్పడుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటి దాన్ని పోషించే బాధ్యత తీసుకోవాలని పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటడం వల్ల వర్షాలు సమయానుకూలంగా పడి భూగర్భ జలాలు పెరుగుతుందన్నారు.

భవిష్యత్తు తరాలకు మనం ఆదర్శంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని మానవుడి ప్రతి అవసరానికి చెట్టు మూలాధారమైందని అలాంటి చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని కాబట్టి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంచిన వాళ్ళమవుతామని కాంగ్రెస్ కార్యకర్తలు, బిఎల్ఆర్ బ్రదర్స్ అందరు నియోజకవర్గం మొత్తం వాడవాడలా మొక్కలు నాటాలని వారు కోరారు.కౌన్సిలర్ దేశిడి శేఖర్రెడ్డి మాట్లాడుతూ మనం అడవులను నరుక్కుంటూ పోవడం వల్ల కోతులు వచ్చి పట్టణాల మీద పడుతున్నాయని కోతులు పట్టణాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఓ రకంగా మనమే కారణమన్నారు. వాటి స్థానాలైనా అడవుల జోలికి మనం పోకపోతే అవి మన జోలికి రాకపోయేవని ఇప్పటికైనా మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, ఊరి బయట రహదారుల వెంబడి పిచ్చి మొక్కల్ని కాకుండా పండ్లను ఇచ్చే చెట్లను నాటినట్టయితే కోతులు జనం మధ్యలోకి రాకుండా గ్రామ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయన్నారు. తలా ఒక పండ్ల చెట్టును గ్రామ పొలిమేరలలో బాధ్యత తీసుకొని నాటినట్లయితే సకల జీవరాశులను కాపాడిన వాళ్ళమవుతామని ఇది ఒక యజ్ఞంల భావించి ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటాలని వారు కోరారు. కార్యక్రమంలో అనుముల మధుసూదన్రెడ్డి, పైడిమరి రంగనాథ్, కౌన్సిలర్ గంధం రామకృష్ణ, పాతూరు ప్రసాద్, రాజేందర్, ఓరుగంటి వెంకటేశ్వర్లు గొల్ల అశోక్ గిరి చల్లా నాగేందర్ కోడిరెక్క ఇంద్ర కుమార్, తాళ్ల వెంకట్రెడ్డి గుంటి జనార్ధన్, ప్రీతం, సంతోష్ ఓరుగంటి శివ, ఐ మొబైల్ శ్రీనివాస్, ఆర్టీసీ రాజా, నందిపాడు అంజి, కాసర్ల రామారావు, శ్రీనివాస్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.