పల్లె గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్ పార్టీలో చేరిక
రంగా రెడ్డి, అక్షిత ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మరియపురం, ఇందిరమ్మ కాలనీకి చెందిన సుమారు 200మందికిపైగా కాంగ్రెస్ పార్టీ నుండి భారీ స్థాయిలో మహిళలు, యువకులు ఆదిబట్ల బిఆర్ఏస్ సీనియర్ నాయకులు పల్లె గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఏస్ పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కులాల వారికి న్యాయం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు . ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కొప్పు జంగాయ్య,బిఆర్ఏస్ నాయకులు కోరే జంగాయ్య, శ్రీనివాస్ గౌడ్, టీంగ్లీకర్ రాజు,అమరేందర్, జయరాడ్,శౌరి, ఆరోగ్య స్వామి, జై రాజు, ఆరోగ్యమ్మ, జ్యోతి, నిర్మల, తీర్జ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.