చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఒక్కసారిగా ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) గురించి ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. టీమ్ బాగా ఆడుతున్నప్పుడు ఎంతో ఉత్సాహంతో కనిపించే ఆ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(Kavya Maran).. జట్టు ఓడుతున్నప్పుడు ఎంతో నిరాశకు గురయ్యే హావభావాల వీడియోలు, ఫొటోలు తనను బాధించేవని అన్నారు. పనిలో పనిగా మేటి జట్టును ఎంపిక చేసుకోవాలని సలహా ఇచ్చారు. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ‘జైలర్’ సినిమా ఆడియో విడుదల సందర్భంగా శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో తలైవా మాట్లాడారు. ‘ఐపీఎల్‌లో తమ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో నిరాశపడుతున్న కావ్యను టీవీలో చూసి చాలా బాధేసింది. వచ్చే ఏడాదైనా గొప్ప ఆటగాళ్లను ఎంపిక చేసుకొని నాణ్యమైన జట్టుతో బరిలోకి దిగాలని కళానిధి మారన్ (కావ్య తండ్రి)ను కోరుతున్నాన’ని రజనీ అన్నారు.