హుజూర్ నగర్, అక్షిత ప్రతినిధి: పట్టణంలోని పీర్ల చావిడి లో శనివారం రాత్రి 11వ షరగత్ లో అగ్నిగుండం కు ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్ని గుండాన్ని పూడ్చడం జరిగింది అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసి పీర్లను గ్రామ ప్రజల సమక్షంలో వివిధ పార్టీల నాయకులతో కలిసి ముజావర్ లు షేక్ సైదా,మొయిన్,నాగుల్ మీరా,మీరా పాషా లు అంగరంగ వైభవంగా మేళ తాళాలతో హుజూర్ నగర్ విధులలో ఊరేగింపు గా పీర్లు ప్రజలకు దర్శనమివ్వగా. ప్రజలు పీర్లకు నీల్లారబోసి గంధం దట్టీలు బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు రాత్రి 12.00 గంటల వరకు పీర్ల చావిడి వద్దనుండి వెళ్లి పీర్ల ను పీర్లబావిలో వేయడంతో పీర్ల పండుగ ముగిసింది అనంతరం ముజావర్ షేక్ సైదా మాట్లాడుతూ 11 రోజులపాటు పీర్ల పండుగను ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు ప్రజలకు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పీర్ల చావీడిలు నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఆక్రమణలకు గురికావడంతో చానా చోట్ల పండుగను ముజావర్లు చేయలేకపోయారని, కొన్నిచోట్ల ఆదాయం లేకపోవడంతో మాన్యాలు కబ్జాలకు గురవడంతో పీర్ల పండుగను జరపలేకపోయారని ఇప్పటికైనా అధికారులు స్పందించి పీర్ల స్థలాలను,మాన్యాలను కబ్జాల నుండి రక్షించి,వక్ఫ్ బోర్డు గెజిట్ ఆస్తుల ను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పీర్ల పండుగను ఘనంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా పండగ జరుపుకునేలా చర్యలు చేపట్టాలని షేక్ సైదా కోరారు.