నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదు సంస్కరణ – మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

  • నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదు సంస్కరణ
  • శాఖాహారంతో ఉన్నత వ్యక్తిత్వ వికాసం
  • శాకాహారం తీసుకోండి.. ఎక్కువ కాలం జీవివించండి
  • పిరమిడ్ స్పిరిచ్చువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సూర్యాపేట లో మెగా శాకాహార ర్యాలి
  • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
  • జెండా ఊపి, ర్యాలీ లో పాల్గొన్న మంత్రి

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి: ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి శాఖాహారం ఎంతగానో దోహదం చేస్తుందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట లోని జమ్మిగడ్డ లో పిరమిడ్ స్పిరిచ్యువల్ సోసైటీస్ మూవ్ మెంట్ సూర్యాపేట – పిరమిడ్ స్పిరిచ్చువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, జెండా ఊపి ప్రారంభిచారు.. అనంతరం వందలాది గా తరలి వచ్చిన శాకాహారులతో కలిసి ర్యాలీ లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి హింసా చోడో.. హంసా పకడో సిద్దాంతం తో బారత దేశాన్ని అహింసాయుత దేశం గా మార్చడానికి బ్రహ్మర్షి పత్రీ జీ నేతృత్వంలో పిరమిడ్ స్పిరిచువల్ సోసైటీ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు.నేటి సమాజానికి కావాల్సింది సంహారం కాదు సంస్కరణ అని పేర్కొన్నారు.శాకాహారం తీసుకోండి.. ఎక్కువకాలం జీవించండని పిలుపునిచ్చారు. శాకాహారం ఆయుష్షును పెంచతుందన్న మంత్రి. కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయన్నారు. వెజిటేరియన్ ఫుడ్ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది అన్న మంత్రి,మాంసాహారం తినేవాళ్లకంటే..

 

శాకాహారులు స్లిమ్‌గా వుంటారన్నారు. శాకాహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుందన్నారు. అందుకే శాకాహారానికి అలవాటు పడితే బరువు తగ్గుతారని తెలిపారు. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. రక్తప్రసరణ సరిగా జరిగి.. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. కూరగాయల్లో ఐరన్, పోషకాలు సమృద్దిగా ఉంటాయి కాబట్టి హృద్రోగాలకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మునిసిపల్ చైర్ పర్సన్ పెరుమాల అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఇమ్మడి సోమ నర్సయ్య, ఉప్పల ఆనంద్, జుట్టు కొండ సత్యనారాయణ, తోట శ్యామ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking