బొగత జలపాతం పున: ప్రారంభం!

వాజేడు, అక్షిత న్యూస్:  ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతం పున ప్రారంభమైంది. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఎప్పుడు బొగత జలపాతం నుండి నీరు గోదావరికి వెళ్ళేవి కానీ గోదావరి పరవళ్ళు తొక్కడంతో అది కాస్త రివర్స్ అయి గోదావరి నుండి బొగత జలపాతానికి భారీ నీరు చేరడంతో బోగత జలపాతం ప్రాంగణమంతా మూసుకుపోయింది. గోదావరి వరద ఆదివారం ఉదయం కల్లా పూర్తిగా తగ్గిపోవడంతో బోగత జలపాతానికి పర్యకుట్టకులను అనుమతించారు. బొగత జలపాతం ప్రాంగణమంతా చెత్తాచెదారంతో వ్యర్థ పదార్థాలతో ఇబ్బందిగా ఉండడంతో అక్కడున్న సిబ్బంది శుభ్రపరుస్తున్నారు . సోమవారం నుండి పర్యటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలియ చెయ్యడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking