ఎఐబి ఎస్ఎస్ నూతన కార్యవర్గం సమావేశంలో..
-మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక…
-దుండిగల్ తండా టూ 27 వ వార్డు.కౌన్సిలర్ శంకర్ చౌహన్ నాయక్…
మేడ్చల్, అక్షిత బ్యూరో:
మేడ్చల్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కార్యవర్గ సమావేశం ఆదివారం. ఏర్పాటు చేయగా ఎఐబిఎస్ఎస్ అధ్యక్షులుగా పోచారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నానవత్ రెడ్యానాయక్ ప్రధాన కార్యదర్శిగా దుండిగల్ పురపాలక 27వ వార్డ్ కౌన్సిలర్ కొర్ర శంకర్ చౌహన్ నాయక్. ఎన్నికైయ్యారు.

తెలంగాణా రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ అధ్యక్షులు రాంచందర్ నాయక్ తెలంగాణా గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్ లు ముఖ్యఅతిధిలు గా జిల్లా ఇంచార్జ్ దేవిదాస్ రాథోడ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నిక చేశారు.మేడ్చల్ జిల్లా పోచారంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్ కార్పొరేటర్ లు దీప్ లాల్ చౌహన్ సుమన్ రాథోడ్ సుభాష్ రాథోడ్ బాలాజీ నాయక్ కౌన్సిలర్ నాను నాయక్ ,సోమ్లాల్ స్థానిక నాయకులు బంజారా సంఘమ్ నాయకులు పాల్గొన్నారు.