ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ కైనా యశోదలో నమ్మకమైన వైద్యం

ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ కైనా యశోదలో నమ్మకమైన వైద్యం

-సినీయర్ హెమటాలజిస్ట్ , బిఎంటీ స్పెషలిస్ట్ గణేష్ జైషేత్వార్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ కైనా హైదరాబాద్ యశోధ హస్పిటల్ లో నమ్మకమైన వైద్యం అత్యదిక సక్సేట్ రేట్ తో అందిస్తున్నామని సినీయర్ హెమటాలజిస్ట్ , బిఎంటీ స్పెషలిస్ట్ గణేష్ జైషేత్వార్ తెలిపారు.నిన్న ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో డాక్టర్ గణేష్ జైషేత్వార్ మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్ లో ముఖ్యంగా మూడు రకాల ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్లు ఉన్నాయి లుకేమియా లింఫోమా హేమటోలాజిక్ అను మూడు రకాలైనటువంటి ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్లు ఉన్నాయి.వీటిలో 67 సంవత్సరాల అత్యంత ఆధునాతన వయసు కోసం అప్లో ఇడెంటికల్ ట్రాన్స్ ప్లాంట్ చేసి సక్సెస్ ను సాధించడం జరిగిందన్నారు. ఇండియాలో మొదటి హాప్ మ్యాచ్ (బోన్ మ్యారో )చేయించుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన 14 ఏళ్ళ సుందరి మేఘన ఈ వాస్తవాన్ని రుజువు చేసిందన్నారు.2023 లో అత్యాధునిక చికిత్సలతో ముప్పు కలిగించే బ్లడ్ క్యాన్సర్ కు ఉపశమనం కలిగించిన 65 ఏళ్ళ క్రాన్సర్ రోగి నాగేశ్వరరావు వయస్సుతో సంభందం లేకుండా ఉపశమనం పోందవచ్చని నిరుపించారు. బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ డిసీజెస్ సర్వైవర్ కలుసుకున్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించుకుంటామని వ్యాధి బారిన పడిన వారిని ఆదుకుంటామని ఈ ప్రాణాంతక పరిస్థితికి నివారణ కనుగొనే దిశగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.నయమైన బ్లడ్ క్యాన్సర్ తో బతికిన వారి నుండి వినడానికి అదే అనుభవంలో ఉన్న ఇతరులకు ఇది చాలా స్ఫూర్తిదాయకంగా సహాయకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికే హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో వేలమంది బ్లడ్ క్యాన్సర్ రోగులకు వైద్యం చేసి సక్సెస్ అయినట్లుగా డాక్టర్ గణేష్ జైషేత్వార్ తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking