క్రీడలకు మరింత ప్రోత్సాహం

క్రీడలకు మరింత ప్రోత్సాహం

ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఈ నెల 8లోపు ప్రతి గ్రామపంచాయతిలో పూర్తవ్వాలని గ్రామీణ క్రీడా కారులను తీర్చిదిద్దెందుకు ఉపయోగించాలని మిర్యాలగూడ ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ హాలులో జరిగిన గ్రామపంచాయతీ కార్యదర్శులు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉద్యోగుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హ్యాబిటెషన్ లలో కూడ ఈ నెల 14లోపు లోపు పూర్తి చేయాలన్నారు.హరితహారం 2023-2024 టార్గెట్ కి అనుగుణoగా తర్వాత పూర్తి చేయాలని నాటిన ప్రతి మొక్క బతికేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.సీజనల్ వ్యాదులు ప్రభాలకుండా వారంలో ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, నీటి నిల్వలు లేకుండా చేయాలని డెంగ్యూ జ్వరం రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

మురుగు నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ ని వేయాలన్నారు.పారిశుధ్య నిర్వహణ ప్రతి రోజు సరిగ్గా నిర్వహించాలి. గ్రామంచాయతి సిబ్బంధి సమ్మెలో ఉన్నందున పారిశుధ్య నిర్వహణకై ప్రతి రోజు వేరే వారిని సిబ్బందిగా పెట్టుకొని పని చేయించాలని తగు సూచనలు చేశారు. సమావేశంలో ఎం‌పి‌ఓ. వీరారెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking