జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతికి సంతాపం

జహీరుద్దీన్ అలీ ఖాన్
మృతికి సంతాపం

మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

హైదరాబాద్ అక్షిత ప్రతినిధి :

ప్రముఖ ఉర్దూ దిన పత్రిక సియాసత్, మేనేజింగ్ ఎడిటర్, జహీరుద్దీన్ అలీ ఖాన్ ఆకస్మిక మరణం పట్ల, మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమం లో, ప్రత్యక్షంగా ఆయన నిర్వహించిన పాత్ర ప్రత్యేకమైనది. లౌకికవాదానికి కట్టుబడ్డ జహీరుద్దిన్ ఒక అభ్యుదయవాది. పాత బస్తీ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించి ఆయన చెరగని ముద్ర వేశారు. దేశంలోని ఉర్దూ జర్నలిజానికి ఆయన మరణం తీరని లోటు అన్నారు.సీనియర్ జర్నలిస్ట్, జహీరుద్దీన్ తెలంగాణ మీడియా అకాడమీ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు. అకాడమీ నిర్వహిస్తున్న “జర్నలిస్టుల సంక్షేమ నిధి ” కమిటీ లో కూడా వారు సభ్యులు. మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు, ఇతర కార్యక్రమాల విధి విధానాలు రూపొందించడంలో వారి సలహాలు ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాధ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking