*నానక్ నగర్ గ్రామంలో లక్ష్మమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి
రంగా రెడ్డి, అక్షిత ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల జడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ అమ్మ కందుకూరి లక్ష్మమ్మ మరణించిన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి నానక్ నగర్ గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులు ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు యాదయ్య, లింగారెడ్డి,శేఖర్, కొండల్, సాయిబాబా స్థానిక ప్రజలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.