వైద్య ఆరోగ్య సిబ్బంది తమ విధులను సక్రమంగా చేపట్టాలి

వైద్య ఆరోగ్య సిబ్బంది తమ విధులను సక్రమంగా చేపట్టాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

వేములపల్లి, అక్షిత ప్రతినిధి :

వైద్య ఆరోగ్య సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ, రోగులకు వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. శుక్రవారం వేములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో ఇప్పటివరకు ఆరోగ్యం మహిళా చికిత్స ద్వారా ఎంతమందికి టెస్టులు ముఖ్యంగా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ ల వివరాలు నమోదు చేసిన రికార్డులను పరిశీలించారు. మండల పరిధిలో పల్లె దవకానాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా స్వయంగా కలెక్టర్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా .కొండల్ రావు, వైద్య అధికారి డా. సుచరిత, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీను, ఎంపీపీ సునీత, ఇంఛార్జి ఎంపీడీవో  సంగీత, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking