పశుపోషణతో మరింత ఆదాయం
విజయా డైరీ చైర్మన్ సోమ భరత్ కుమార్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
వ్యవసాయంపై ఆధారపడే రైతులకు మరింత ఆదాయం పెంచేందుకు పశుపోషణ ప్రధానమైనదని విజయా డైరీ చైర్మన్ సోమ భరత్ కుమార్ అన్నారు. శుక్రవారం దామచర్ల మండల కేంద్రంలోని లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాలులో పాడి రైతులకు విజయా డైరీ, ఎస్ బి ఐ బ్యాంకు ఆధ్వర్యంలో రుణాలు ఇచ్చేందుకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయా డైరీ చైర్మన్ మాట్లాడుతూ పాడి రైతులకు రైతులకు పంట పండిస్తేనే ఆదాయం వస్తుందన్నారు. అదే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలు స్థాపించే ఆదాయం పెంచుకోవాలన్నారు.

గతంలో భారత దేశ చరిత్రలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమంలో ముందు ఉండేదన్నారు. రైతులను బలోపేతం చేసేందుకు ఎస్బిఐ, విజయ డైరీ సంయుక్తంగా ముందుకు సాగుతూ రైతులకు ముఖ్యంగా వారికి అండగా మహిళలు నిలబడేలా చేస్తూన్నామన్నారు. మహిళలు ఈ రంగంలో రాణించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మొట్టమొదటగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎస్బిఐ బ్యాంక్ వారు ఏ హామీ లేకుండా పోషణకు లోను మంజూరు చేస్తారు అన్నారు. తెలంగాణ వచ్చాక సర్వం సాధించి అభివృద్ధి పెరుగుతుందన్నారు. అదేవిధంగా మన అవసరాలు కూడా పెరుగుతున్నాయని, పేద ప్రజలు బలోపేతం అయ్యి గౌరవంగా బ్రతకాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పాలన సాగుతుందన్నారు. అందులో భాగంగా తండాలని గ్రామపంచాయతీలుగా మార్చారు. రైతులకు రైతుబంధు, దళితులకు దళిత బంధు, కేసీఆర్ కిట్టు, మొదలగు పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పథకం రూపొందించి విజయ డైరీ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగ పడాలన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులు, యాదవులు ఎక్కువగా ఉంటారని వారంతా పాల ఉత్పత్తిలో అభివృద్ధి సాధించాలన్నారు. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే కల్తీ లేని పాలు మార్కెట్లోకి రావాలన్నారు. అందుకని ఈ ప్రాంత ప్రజలు పశు పోషణను ఉపయోగించుకొని అభివృద్ధి సాధించాలన్నారు. ఒక గ్రామంలో కనీసం 50 మంది రెండు పశువులను కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని ప్రారంభించాలన్నారు. మరో ఆరు నెలల కు రెండు పశువులను కొనుగోలు చేసే పశు పోషణను విస్తరించాలన్నారు. ఈ విధంగా పాల ఉత్పత్తిలో గుజరాత్ కంటే తెలంగాణ ముందుండాలని అన్నారు. ప్రస్తుతము ఒక కోటి 20 లక్షల లీటర్ల పాలు అవసరం ఉన్నాయి. కానీ 70 నుండి 80 లక్షల లీటర్ల మాత్రమే సేకరిస్తున్నాం. ఇంకా 50 లక్షల లీటర్ల పాలు అవసరం ఉందన్నారు. అందుకోసం తెలంగాణలో పాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పాల ఉత్పత్తి తో పాటు పశువుల పేడ ద్వారా బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు. అదేవిధంగా పశువుల పేడ ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 1962 కింద రెండు సంచార పశువైద్య వాహనాలు ఉన్నాయన్నారు. పశు స్సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విజయ డైరీ ఎండి అధర్ సిన్హా మాట్లాడుతూ, పశు పోషణలో భాగంగా మహిళల ద్వారా పాల సేకరణ చేస్తామన్నారు. అందులో భాగంగా విజయ డైరీ ఆఫీస్, వెటర్నరీ చికిత్స కేంద్రము ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆయన కోరారు. ఈ పథకం అమలులో భాగంగా మా విజయ డైరీ డిడి, ఎస్బిఐ సీనియర్ ఆఫీసర్ స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సేవలందిస్తారని ఆయన తెలిపారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లబోతు భాస్కరరావు మాట్లాడుతూ, మహిళలు తమ కాళ్ళ మీద నిలబడడానికి ఈ పశు పోషణ పథకం ఉపయోగపడుతుందన్నారు. మన ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంటేషన్ ద్వారా 25 వేల మంది జనాభా పెరుగుతుదని అన్నారు. ఆ జనాభాకు తగ్గట్టుగా పాల ఉత్పత్తిని పెంచుకోనీ ఉపాధి పొందాలన్నారు. అదేవిధంగా వెటర్నరీ చికిత్స కేంద్రం అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ను, వెటర్నరీ జేడీని కోరారు. సీఎం కేసీఆర్ గొర్లు, బర్రెలను సమృద్ధిగా పెంచి పశుపోషణకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. మన ప్రాంతంలో ఫారెస్ట్ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున గేదలను మేపుకోవడం కూడా సులభంగా ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ, విజయ డైరీ, ఎస్బిఐ వారు పశు పోషణకు రుణాలు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. నేను కరీంనగర్లో పనిచేసినప్పుడు దళిత బంధు కింద గేదెల యూనిట్లను ఎంపిక చేయగా, హర్యానా నుండి గేదెలను లబ్ధిదారులు తెచ్చుకున్నారని, ఆ యూనిట్ల ద్వారా కరీంనగర్ ప్రాంతంలో పాల ప్రొటెక్షన్ పెరిగింది అన్నారు. ఉదాహరణకు రామస్వామి అనే లబ్ధిదారుడు డైరి యూనిట్ కోసం షెడ్డును మంచిగా వేసి యూనిట్ ను ప్రారంభించి అభివృద్ధి పదంలో కొనసాగుతున్నారని తెలిపారు. కాబట్టి ఈ పథకాన్ని మొదటగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని స్థాపిస్తునందున సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్తక శాఖ జెడి యాదగిరి, విజయ డైరీ డిడి, ఎస్బిఐ సీనియర్ ఆఫీసర్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.